క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఈ పేరు వినిడం ప్ర‌జ‌ల‌కు అల‌వాటు అయిపోయినా.. దీని భ‌యం మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ ప్రాణాంత‌క‌ర మ‌హ‌మ్మారి ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ భ‌యంభ‌యంతో బ‌తుకుతున్నారు. మ‌రోవైపు ఈ వైరస్ దెబ్బకు రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ లేని కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా అదుపులోకి రావ‌డం లేదు. ఇక క‌రోనాని క‌ట్ట‌డి చేయాలంటే మనిషికి మనిషి భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం. 

 

మ‌రోవైపు వ్యాక్సిన్ల తయారీకి ఇంకా సమయం పడుతుందంటున్నారు సెంటిస్టులు. దీంతో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నాయి. అయితే సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు ఎలాంటి వైరస్‌ని అయినా ఎదుర్కునే శక్తిని కలిగి ఉంటాయి. ఈ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ వైరస్‌ యొక్క ప్రత్యుత్పత్తి జరగకుండా అడ్డుకుంటుంది. అలానే కరోనా వైరస్‌ని నాశనం చేసే శక్తిని కూడా ఈ కిరణాలు కలిగి ఉంటాయని అమెరికాకు శాస్త్ర‌వేత్త‌లు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు యూవీ లైట్ కిరణాల సహాయంతో కొత్త ప్రయోగం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే అతినీలలోహిత కిరణాలతో కరోనా మ‌హ‌మ్మారిని నాశానం చేయ‌వ‌చ్చ‌ని గుర్తించారట. 

 

ఇందులో భాగంగా.. ఆ కాంతి కిరణాలతో కూడిన అల్ట్రావయోలైట్ పరికరాన్ని రూపొందించారు. దాదాపు 200 నుంచి 300 నానో మీటర్ల మేర తీవ్రత కలిగిన అతినీలలోహిత కిరణాలను వైరస్ పై పంపినపుడు కరోనా వైరస్ చనిపోతుందంటున్నారు. యూవీ లైట్ వల్ల పునరుత్పత్తి గానీ, ఇన్ఫెక్షన్లకు గానీ ఏమాత్రం అవకాశం లేకుండా శక్తిహీనమవుతాయట. అయితే యూవీ లైట్ ఎమిటింగ్ డయోడ్ల ధర మాత్రం కాస్త ఎక్కువే ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు.. దీని సర్వీసు మాత్రం ఎక్కువకాలం మన్నుతుందట. దీంతో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్న యూవీ లైట్ ఎమిటింగ్ డయోడ్ల ఉత్పత్తి పెంచి త్వరలో జనంలోకి అందుబాటు రానున్నాయ‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు ఇది కాస్త ఊర‌ట‌నిచ్చే వార్త‌లా క‌నిపిస్తోంది.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: