తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3020కు చేరుకుంది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2572 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు.  ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 99కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో మరో కత్త ట్విస్ట్ నెలకొంది. మధుసూదన్ కరోనాతో చనిపోయాడని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ప్రభుత్వం హైకోర్టుకు తెలపగా.. ఆయన చనిపోయి చాలా రోజులు కాగా వైద్యులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వలేని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణం సంగతి తనకు ఎవరూ చెప్పనేలేదని వాపోయారు. ఆ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలని మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోయాడని అనేందుకు ఆధారాలు చూపించాలని మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. లక్షణాలు ఉన్నవారికి, వృద్ధులకు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న హైరిస్క్ వ్యక్తులకే కరోనా పరీక్షలు చేపడుతున్నట్టు వివరించారు.  కావలానే..  అ కొన్ని రాజకీయ పక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని, కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

 

వాళ్లకో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారని, ఈ సమస్యను ఎవరూ రాజకీయ కోణంలో చూడరాదని, ఇది ప్రపంచం మొత్తం ఉన్న సమస్య అని స్పష్టం చేశారు.  మరోవైపు, మధుసూదన్ కరోనాతో మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ హైకోర్టుకు తెలిపింది. వనస్థలిపురం మధుసూదన్ మృతిపై అతని భార్య మాధవి హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తన భర్త ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించిన విషయాలు చెప్పమని మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: