వైసీపీ అధికారంలో వచ్చిన టైం లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా  గెలవడంతో రోజా కి మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ ముందు భావించారు. కానీ తర్వాత పరిస్థితులు చూస్తే అందరి అంచనాలు తలకిందులయ్యాయి. జగన్ కి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రజాప్రతినిధులకు మంత్రి పదవులు రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రోజా అప్పట్లో కొద్దిగా హైకమాండ్ పై అలిగినట్లు వ్యవహరించడంతో మంత్రిపదవికి సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని వైయస్ జగన్ కట్టబెట్టటం జరిగింది. దీంతో వైయస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం రోజా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్స్ విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక పాలసీ తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసినదే.

IHG

సింగల్ డోర్ విధానంతో వైయస్ జగన్ సినిమాలకు సీరియల్స్ కు అనుమతులు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సంబంధబాంధవ్యాలు ఉన్న రోజాను షూటింగ్ విషయంలో తీసుకువచ్చిన ప్రత్యేక పాలసీ కమిటీకి చీఫ్గా నియమించినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలో టాక్. ఇందుకోసం రోజా దగ్గర పని చేయడానికి ప్రభుత్వం ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నట్లు సమాచారం. 

IHG

ఎవరైనా టాలీవుడ్ దర్శక,నిర్మాతలు హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం  పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున ఆమె నేతృత్వంలో ఉన్న కమిటీకి విన్నవిస్తే సరిపోతుంది. దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజా పర్మిషన్ వల్ల మాత్రమే షూటింగ్ లు జరగబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త తెలుసుకుని రోజా ఉబ్బి తబ్బైపోయి సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపినట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: