2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ పరిస్థితి చాలా దారుణమైపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే చంద్రబాబు అధికారం కోల్పోయారో, అప్పటి నుంచి టీడీపీ నేతలు షాకులు ఇవ్వడం మొదలుపెట్టారు. వరుస పెట్టి షాకులు ఇస్తూ మొదట్లో బీజేపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెళ్ళినా ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్ గా పార్టీలో ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యే పదవి పోకుండా వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకోకుండా జగన్‌కు జై కొట్టారు. దీంతో ఆయన పదవికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

 

ఇక వంశీ బాటలోనే మద్దాలి గిరి, కరణం బలరాంలు కూడా నడిచారు. బాబుకు షాక్ ఇచ్చి జగన్‌కు మద్ధతు తెలిపారు. అయితే వీరు పేరుకు టీడీపీ ఎమ్మెల్యేలగానే ఉంటూ, వైసీపీ మద్ధతుదారులుగా కొనసాగుతున్నారు. సరే వీరి బాటలోనే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు జంపింగ్ ఖాయమని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారు.

 

అయితే ఏమైందో తెలియదుగానీ నాలుగురోజులు పోయాక, ఇద్దరు బయటకొచ్చి టీడీపీని వీడటం లేదని ప్రకటనలు చేశారు. కాకపోతే ఇందులో ఏలూరి వైసీపీ వైపు వెళ్లకుండా యూ టర్న్ తీసుకోవడం వెనుక పెద్ద కథే నడిచిందని తెలుస్తోంది. ఏలూరి టీడీపీని వీడకుండా బాబు ఆపారని తెలుస్తోంది.

 

ఏలూరికి రాష్ట్ర స్థాయి పదవి, నెక్స్ట్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ హామీతోనే ఏలూరి పార్టీ మారకుండా కామ్ అయిపోయారని తెలుస్తోంది. అందుకే అనుకుంటా మళ్ళీ ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అయితే అనగానికి ఇలాంటి హామీ ఏమి రాలేదని, అందుకే ఆయన అటు ఇటు ఊగిసలాడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: