ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నుండి  ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. అధికార పార్టీలు  ఎన్ని ఇబ్బందులు సృష్టించిన అన్నింటినీ ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఏకంగా ఘన విజయం సాధించి మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఎంతో అనుభవం గల వ్యక్తిగా పాలన సాగిస్తున్నారు. ఎక్కడ అవినీతి జరగకుండా ఉండేలా ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ... ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 


 ఇక మొన్ననే  ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి  ఏడాది కాలం పూర్తయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అధికార పార్టీలో రోజురోజుకు అధినేత జగన్మోహన్ రెడ్డి పై అసంతృప్తి  స్వరాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏకంగా మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువుల నుంచి బహిరంగంగా ఇలాంటి అసంతృప్తి జ్వాలలు రావడం ఆంధ్ర రాజకీయాల్లో  సంచలనంగా మారింది. మరోవైపు సీనియర్ నేతలైన ధర్మాన లాంటి వాళ్లు కూడా జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అసంతృప్తి వెనుక కారణం... పార్టీ నేతలకు కావాల్సింది ఏమిటి అన్నది జగన్ వారితో కూర్చుని మాట్లాడటం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. 

 


 కనీసం ఒక వ్యక్తిని పార్టీ నేతల సమస్యలన్నీ తన దగ్గరకు చేర్చే విధంగా జగన్ నియమించుకుంటే బాగుండేదని కానీ అలాంటిదేమీ చేయలేదు  జగన్మోహన్ రెడ్డి. దీంతో తమకు కావాల్సింది ఏమిటి అనేది ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియదు జగన్మోహన్ రెడ్డి పైన ఏకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. తమ అసంతృప్తిని అసహనంగా  వ్యక్తం చేస్తూ ప్రస్తుతం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇలా జరగడం సంచలనమే  అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అసంతృప్తి జ్వాలలు సద్దుమణిగేలా చేస్తారా లేదా అన్నది చూడాలి మరి,

మరింత సమాచారం తెలుసుకోండి: