కేరళ రాష్ట్రంలో ఏనుగు హత్య దేశ  వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. పైనాపిల్ లో బాంబు పెట్టి ఎనుగుకు ఇవ్వడంతో గర్భంతో  ఉన్న ఏనుగు పైనాపిల్ తిని యాపిల్ పేలడంతో ఏనుగు  మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా ఎంతో మందిని కలిచి వేసింది. ఈ ఘటనపై సేవ్ ఎనిమల్స్ అనే నినాదం కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది జంతు ప్రేమికులు ఏకంగా ఉద్యమమే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏనుగు మరణం పై జరుగుతున్నటువంటి యుద్ధం రకరకాల మలుపులు తీసుకుంటుంది. ఇందులో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. 

 


 మామూలుగా అయితే కొన్ని రాష్ట్రాలలో ఏనుగు  కనిపించిందంటే భయాందోళనకు గురికావడం లేదా వింతగా చేస్తూ ఉంటారు. కానీ కేరళ రాజస్థాన్ రాష్ట్రలలో మాత్రం అక్కడి ప్రజలకు తరచూ ఏనుగులు  కనిపించడం కామన్ గా మారిపోయింది. ఎందుకంటే అక్కడ టూరిస్టులను ఏనుగుల మీద ఎక్కించుకుని తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా అయితే కేరళలో ఒక ఊరి ని  విస్తరించుకుంటూ వెళ్లి ఏకంగా అడవిలోకి వెళ్ళి పోయారు అక్కడి  ప్రజలు. దీంతో అడవి జంతువులు ఊర్లోకి వస్తుండడంతో వాటినుంచి ప్రాణభయం ఉంది అని భావించి వాటిని ఎదుర్కోవడానికి ఇలాంటి బాంబు లు పెడుతున్నారు. 

 


 ఇలా ఎన్నో ఎలుగు బంట్లు  ఏనుగులు కూడా చనిపోతూ ఉంటాయి. ఏనుగు మరణం నేపథ్యంలో ఎన్నో రకరకాల వాదనలు ప్రస్తుతం తెరమీదకు వస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న మొత్తం ఏనుగులు  500... 2017 లో 17, 2018 లో 34,  2019లో 19 ఏనుగులు చనిపోయాయి. 2017 నుంచి 2018 వరకు ఈ మనుషులు పెట్టిన హింస కారణంగానే చనిపోయాయి . వీటిపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. వాస్తవంగా అయితే తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి బాంబులు పెడుతుంటారు మనుషులు అదే సమయంలో అడవిలో ఆహారం దొరకక ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి  జంతువులు. అయితే ఇలా జంతువులు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు వాటికి ఆహారం నీరు తగినంతగా ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: