సోషల్ మీడియా.. ఇది నవతరం మీడియా. ఇప్పడు చాలా వరకూ ఈ సోషల్ మీడియానే ప్రజలకు అనేక వాస్తవాలు కళ్లముందు ఉంచుతుంది. అయితే ఈ సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకోవాలి. తేడా వస్తే మాత్రం పోలీసు కేసులవుతాయి. కేసుల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. అందుకే ముందు ఈ ఐటీ చట్టాలు సోషల్ మీడియా గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

 

 

సోషల్ మీడియాలో ట్రోలింగ్ చాలా ప్రమాదకం. ఆడవారి మీద అసహ్యకర, అసభ్య, జోకులు వేయడం, వారి పేర్లు పిక్స్ కు పెట్టడం డేంజర్. అలాగే డిఫమేషన్ అంటే.. ఆడపిల్లలు లేదా పెళ్లి అయిన వారి ని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టడం.. వారి కుటుంబ ప్రతిష్ట ను దెబ్బ తీసేలా కామెంట్స్ చేయడం.. పరువు నష్టం కలిగించడం కూడా చాలా పెద్ద నేరం కిందే వస్తుంది. ఇంకా స్టాకింగ్ అంటే ఆడవారిపై అభ్యంతరకర కామెంట్స్ చేయడం, పోస్టులు పెట్టడం కూడా నేరమే.

 

 

ఇలాంటి పనులకు పాల్పడిన వారు.. వారి స్నేహితులైనా.. సన్నిహితులైన.. బంధువులైనా… ఐటీ ఆక్ట్ 2000 ప్రకారం నేరస్థులు గా పరిగణింపబడుతారు. ఐటీ ఆక్ట్ 2000ఐటీ ఆక్ట్ సెక్షన్ 66ఐపీసీ సెక్షన్ 292సెక్షన్ 354A 354D (నిర్భయ చట్టం) సెక్షన్ 499సెక్షన్ 66D ట్రోల్ చేసే వారి కోసం.. సోషల్ మీడియా లో శ్రుతి మించి ప్రవర్తిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఐటీ ఆక్ట్ సెక్షన్ 66 ప్రకారం పనిష్మెంట్ ఫర్ వయోలాషన్ ఆఫ్ ప్రైవసీ కింద.. నిర్భయ చట్టం లోని సెక్షన్ 354A, 354D ప్రకారం హారాస్మెంట్ వయా ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రకారం నేరం.

 

 

ఇలాంటి విషయాల్లో తెలియక చేశాను.. అందరూ చేస్తున్నారని నేనూ చేశాను.. ఏం నేనొక్కడినే చేశాను.. వందల మందిని ఇలా చేసినవాళ్లను చూపిస్తాను అంటూ లాజిక్కులు మాట్లాడితే కుదరదు. అందుకే సోషల్ మీడియాలో కాస్త కుదురుగా ఉండండి. అనవర వివాదాల జోలికి వెళ్లి చిక్కుల్లో పడకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: