కరోనా వైరస్ తో పోరాడే విషయంలో వైద్యులతో పాటు పోలీసులు కూడా బాగా కష్టపడుతున్నారు. ప్రపంచంలోనే  బాగా టెక్నాలజీ మరియు అభివృద్ధి చెందిన దేశాలు ఈ వైరస్ తో పోరాడే విషయంలో చేతులెత్తేస్తే ఇండియాలో మాత్రం చాలా వరకు వైరస్ కంట్రోల్ అయింది అంటే దానికి కారణాలలో ఒక కారణం పోలీస్ లు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాత్రి పగలు రోడ్డు మీద ఉంటూ దేశ ప్రజలకు కరోనా వైరస్ అంటకుండా వారిని ఇంటి నుండి బయటకు రానీయకుండా ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి డ్యూటీలు చేస్తున్నారు. అటువంటి పోలీస్ కి, దేశాన్ని కాపాడిన ఈ యోధులకు అతి పెద్ద కష్టం వచ్చి పడింది.

 

అది కూడా తమ ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. పూర్తి మ్యాటర్ లోకి వెళ్తే దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నా రాష్ట్రం మహారాష్ట్ర. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు లాక్ డౌన్ డ్యూటీ చేస్తున్న చాలామంది పోలీసులకు కరోనా వైరస్ సోకుతోంది. కనీస జాగ్రత్తలు మరియు భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు కల్పించడం లేదని విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి.

 

కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 30 మందికి పైగానే చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారిపడ్డ పోలీసుల సంఖ్య 2557కు చేరిందని ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 74,860 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా వీటిలో 39,944 యాక్టివ్‌ కేసులున్నాయి. 32,329 మంది కోలుకున్నారు. ఈ పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: