ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి.. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరగాలి. మనది వ్యవసాయ ప్రధాన దేశమే అయిన సాగు ఏమాత్రం లాభదాయకం కాని దుస్థితి ఉంది. అందుకే జనం ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్తుంటారు. మరి నగరాల్లో ఉపాధి ఇచ్చేవి ఏంటి.. ఈ ప్రశ్నకు సమాధానంగా వచ్చేది పరిశ్రమలే. అంటే పరిశ్రమలు ఉంటే అభివృద్ధి ఉంటుందని భావించే పరిస్థితి ఉంది.

 

 

మరి పరిశ్రమలు బాగా రావాలంటే.. పెట్టుబడిదారులు కావాలి.. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఉండాలి. అయితే పరిశ్రమల ద్వారా కేవలం అభివృద్ధి మాత్రమే రాదు.. కాలుష్యం అనే భూతం కూడా వస్తుంది. అయితే సాధ్యమైనంత తక్కువ కాలుష్యం వెలువడేలా పారిశ్రామిక విధానాలు ఉంటే.. ఆ రాష్ట్రం బాగుపడుతుంది. అక్కడి ప్రజలు బాగుపడతారు.

 

 

కానీ.. తక్కువ కాలుష్యం వెలువడేలా చర్యలు తీసుకుంటే పారిశ్రామిక వేత్తల లాభాల్లో కోతపడుతుంది. అందుకే చాలా ప్రభుత్వాలు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా... పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పట్ పరుస్తుంటాయి. పరిశ్రమ పెడతామని ఎవరైనా వస్తే చాలు.. సకల సౌకర్యాలు కల్పిస్తామంటారు. ఇక అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ వంటి రాష్ట్రం అయితే పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక తంటాలు పడాల్సివస్తోంది.

 

 

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే... ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా అదివరకే టై అప్‌ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. వాటిని పాటిస్తేనే పరిశ్రమకు అనుమతి లభిస్తుంది. మరి ఈ కొత్త రూల్ ప్రకారం పరిశ్రమలు పెట్టేందుకు ఏపీకి పెట్టుబడిదారులు వస్తారా.. పారిశ్రామికంగా ఏపీ ఫ్యూచర్ ఏంటి అన్నది ముందు ముందు చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: