బిజెపి విషయంలో జగన్ ఎటు తేల్చుకోలేక పోతున్నారు. ఏపీ బీజేపీ నేతలు తమను అడుగడుగున ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్న, కేంద్రం లో మాత్రం వైసీపీ ప్రభుత్వం పై సానుకూల దృక్పథం ఉండటం, అన్ని విషయాల్లోనూ ప్రధాని నరేంద్రమోదీ సహాయ సహకారాలు అందించడం,  వైసిపి స్నేహాన్ని కోరుకోవడం వంటి పరిణామాలతో బీజేపీతో జగన్ సఖ్యత గానే ఉంటూ వస్తున్నారు. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీరుతో జగన్ మొదటి నుంచి ఇబ్బంది పడుతున్నట్టు గా కనిపిస్తున్నారు. జగన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా ఉంటూ ఉండడం, అమిత్ షా మాత్రం ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉంటూ, తన వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేయకుండా ఉండడం, వంటి పరిణామాలతో జగన్ చాలా కాలంగా అమిత్ షా వ్యవహారశైలిపై ఆగ్రహం గానే ఉన్నారు. అయినా బీజేపీతో స్నేహం కోరుకుంటూ ఉండడంతో ఆ విషయాలను జగన్ పరిగణలోకి తీసుకుని జగన్ కేంద్రం వద్దకు పదేపదే వెళ్లి వారితో సఖ్యత గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 

IHG


తాజాగా అమిత్ షా తో జగన్ భేటీ కావాల్సి ఉంది ఈమేరకు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా జగన్ కు లభించింది. ఈ మేరకు జగన్ ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నంలో ఉండగానే, అకస్మాత్తుగా ఆయన అపాయింట్మెంట్ రద్దు అవ్వడంతో జగన్ ఢిల్లీ ప్రయాణం రద్దయింది. దీంతో ఒక్కసారిగా విపక్షాలు జగన్ ను ఎద్దేవా చేశారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇలా చివరి నిమిషంలో రద్దు కావడం జగన్ కు కొత్తేమీ కాదు. గతంలో అనేక సార్లు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, ఒక రోజంతా వెయిట్ చేయించి మరి అపాయింట్మెంట్ రద్దయినట్లు ప్రకటించడం, జగన్ పరాభవంతో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం జరుగుతూనే వస్తున్నా యి.

IHG


 మొదటినుంచి జగన్ విషయంలో అమిత్ షా ఇదే ధోరణి అవలంభిస్తున్నారని, పైకి సఖ్యతగా ఉంటాము అన్నట్లుగానే ఆయన చెబుతున్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ, అమిత్ షా మాత్రం ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి జగన్ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కంటే అమిత్ షా బలమైన నాయకుడు అనేది బిజెపిలో వినిపిస్తున్న మాట. ప్రధాని సైతం ఏ పని చేయాలన్నా, అమిత్ షా సూచన తోనే ముందుకు వెళ్తారు. షాడో ప్రధానిగా అన్ని విషయాల్లో చక్రం తిప్పుతారు అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన జగన్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: