ఈ మాయదారి కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రెండు నెలలు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు చేయడానికి పనులు లేక.. ఎలాంటి ఆదాయం లేక కన్నీటి కష్టాలు పడుతున్నారు.  ప్రభుత్వం.. కొద్ది మంది సహాయం చేస్తున్నామన్నా.. అవి వారికి చేరుతున్నాయా అన్న విసయం దేవుడెరుగు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎక్కువగా కష్టపడింది.. నష్టపోయింది వలస కార్మికులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు.  వలస కార్మికులు అయితే చేయడానికి పనులు లేక తమవారిని చేరుకోలేక కాలినడకన వందల కిలోమీటర్లు నడిచిన వైనం.. ఇక కరోనా వల్ల సినీ పరిశ్రమ కూడా చాలా కష్టాల్లో పడింది. రోజు వారి కార్మికుల నానా ఇబ్బందులు పడ్డారు.. అయితే వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం, సినీ పరిశ్రమకు చెందిన వారు ముందుకు వచ్చారు.

 

ఇక పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో. కరోనా కారణంగా అన్ని తారుమారు అయిపోయాయి. ఊహించని విధంగా జీవితాలు మలుపు తిరిగాయి. తాజాగా పాఠాలు చెప్పిన ఓ టీచర్ తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వెలుగు చూసింది.  ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణ కోసం ఇలా చేయక తప్పడం లేదని ఆ టీచర్ చెబుతున్నారు. దీంతో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కూడా ఇలాంటి కష్టాలు రావడం చూసి పలువురు చలించిపోతున్నారు. వేదాయపాళెంకు చెందిన వెంకటసుబ్బయ్య 2008 నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ స్కూలులో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

 

ఇటీవల లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాడు. కానీ ఆన్ లైన్ వ్యవహారం ఆయనకు సరిగా అర్థం కాకపోవడం.. ఫోన్ పని చేయకపోవంతో యాజమాన్యం ఆయన్ని పక్కన బెట్టింది. గతంలో కొడుకు వైద్యం కోసం చేసిన రూ. 3.50 లక్షల అప్పు చెల్లించాల్సి ఉండటంతో ఇలా పండ్లు అమ్మడం ప్రారంభించాడు. అరటి పండ్లు తోపుడు బండిపై పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ కనిపించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: