న‌వ్యాంధ్ర రెండో సీఎంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టి.. ఇటీవ‌ల ఏడాది పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఏడాది కాలంలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు కోర్టు ఎన్నో షాకులు ఇచ్చింది. ఇప్పటికే దాదాపు 60పైగా విషయాల్లో జగన్ సర్కార్ కు కోర్టులు ఝలక్ ఇచ్చాయి. లీగల్ విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ సరైన విధానాన్ని పాటించకపోవడం వల్లనే హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయ‌ని అంటున్నారు. అయితే జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న ప్రతీ నిర్ణయంలో ఎవరో ఒకరు పిటీషన్ వేయడం.. దానిపై హైకోర్ట్ విచారణ చేయడం.. అదే విధంగా వ్యతిరేకంగా తీర్పు రావడం కామ‌న్ అయిపోయింది.

 

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ స‌ర్కార్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలా వరుసగా ఏపీ ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురు కావడంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు కోర్టు తీర్పులను తప్పుబ‌ట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అధికార పార్టీకి చెందిన‌ స్పీకర్ సీనియర్ మోస్ట్ నాయకుడు తమ్మినేని సీతారాం రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల కోసమే ఉన్నాయని అంటున్నారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం తగదని వ్యాఖ్యానించారు. ఇదంతా ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల తీర్పులు రావడం పైన స్పందనగా చెప్పుకోవ‌చ్చు. మ‌రోవైపు వైసీసీ  ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు శాసన వ్యవస్థలోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే కోర్టుల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, అయితే కోర్టులు ప్రజాహితం చూడాలని ఆయన అంటున్నారు. 

 

అయితే ఇదే స‌మ‌యంలో.. అటు మోడీ స‌ర్కార్‌కు కూడా కోర్టులో షాకుల మీదు షాకులు త‌గులుతున్నారు. ఈ క్ర‌మంలోనే న్యాయశాఖ మంత్రిగా ఉన్న shankar PRASAD' target='_blank' title='రవి శంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవి శంకర్ ప్రసాద్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజకీయ ఉద్దేశ్యాలతో అవి కోర్టులకు వెళ్ళి అక్కడ నుంచి ప్రభుత్వాన్ని శాసించాలని చూస్తున్నాయని ద్వ‌జ‌మెత్తారు. దీనిని బ‌ట్టీ.. ఇటు వైసీపీనే కాదు, అటు మోడీ సర్కార్‌కు కూడా  ప్రజా వ్యాజ్యాలు వరసగా కోర్టులలో దాఖలు చేసి ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాల పట్ల ఆగ్రహంగా ఉన్నాయని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌ రెండూ అధికార ప్రభుత్వాలే. మోడీకి, జగన్ కి తరచుగా ఈ ఇబ్బంది వస్తోంది. మ‌రి వీరిద్ద‌రు ఎదురెదురు ప‌డితే.. వీటిపైనే నిపుణుల‌తో చ‌ర్చ‌లు ఉంటాయా అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది.

 
  
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: