దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల విద్యార్థుల చదువుల్లో గందరగోళం నెలకొంది. జులై, ఆగష్టు నెలల నుంచి పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 
 
పలు దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలను సడలించి విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తున్నారు. అయితే ఆయా దేశాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి మన దేశంలో భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో మెజారిటీ శాతం విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. 
 
పాఠశాలల్లో భౌతికదూరం సహా ఇతర జాగ్రత్తలు తీసుకుంటామని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నా ప్రజలు విశ్వసించటం లేదు. వర్చువల్ తరగతులకే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకల్‌సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ మొత్తం 224 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో దాదాపు 37 శాతం మంది తల్లిదండ్రులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. 
 
సర్వేలో 21 రోజులుగా కొత్త కేసులు నమోదుకాని చోట పాఠశాలలు పునఃప్రారంభానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. దేశంలో కొత్త కేసులు నమోదు ఆగిన మూడు వారాల తర్వాత పాఠశాలను ప్రారంభించాలని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు పాఠశాలలను తెరవవద్దని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చేయడం అంత సులభం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్‌లో పాఠశాలలను తెరవగా 70 మంది విద్యార్థులు వైరస్ భారీన పడ్డారు. ఇజ్రాయెల్‌లో పాఠశాలలు ప్రారంభమైన రెండు వారాల తర్వాత 220 మంది విద్యార్థులకు వైరస్ సోకింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: