కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం, వారి పురోగతి కోసం రోజురోజుకి ఏదో ఒక కొత్త పథకం అందిస్తూ వస్తుంది. ఇందులో తాజాగా చెప్పుకోవలసిన పథకం అంటే అటల్ పెన్షన్ యోజన స్కీమ్. ముఖ్యంగా ఈ స్కీం అసంఘటిత రంగంలో పని చేసే వారికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. ఇకపోతే ఈ స్కీమ్ లో రోజుకి కేవలం రూ. 7 లతో ఆదా చేసుకోవడం ద్వారా నెలకు ఐదు వేల పెన్షన్ పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. అంటే సంవత్సరానికి ఏకంగా ఆరు వేల రూపాయల పెన్షన్ ని అందించబడుతుంది. 

 


ఇకపోతే మోదీ సర్కార్ తాజాగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ వివరాలను మార్చింది. ఇక ఈ స్కీమ్ లో చేరాలనుకొనేవారు నేరుగా బ్యాంకు కు వెళ్లి ఈ స్కీమ్లో చేరుకోవచ్చు. అయితే ఈ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ ప్రకారం కేవలం 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు మాత్రమే ఈ పధకంలో అర్హులు. అంతే కాదు కేవలం ఆదాయ పన్ను చెల్లించని వారు మాత్రమే ఈ స్కీం కి అర్హులు. నెలకు 1000 నుండి 5000 వరకు పెన్షన్ ను ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. ఇకపోతే ఈ కొత్త రూల్స్ ఒకసారి చూస్తే... ఇందులో మొదట సమర్పించిన వివరాల ప్రకారమే వారి వివరాలు నమోదు అయి ఉంటాయి. మళ్లీ వీటిని అప్గ్రేడ్, డౌన్ గ్రేడ్ ఫెసిలిటీ వారికి ఉండదు. ఇంతకుముందు ఈ స్కీం లో చేరిన వారు సంవత్సరానికి ఒక సారి పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకోవడం లేదా పెంచుకోవడానికి అవకాశం ఉండేది. ఇకపై ఆ బెనిఫిట్ వారికి ఉండదు.

 

APY సబ్స్క్రైబర్లు pran కార్డు ను పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన సంబంధించిన వెబ్ సైట్ లో APY సబ్స్క్రైబర్లు సమాచారం వారి ఫామ్ అందుబాటులో ఉంటాయి. ఈ సబ్స్క్రైబర్లు WWW.npscra.nsdl.co.in వెబ్ సైట్ కు వెళ్లి EPARN ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అందులో మనకి pran కార్డు యొక్క ఇమేజ్, అలాగే వ్యక్తిగత సమాచారం మరికొన్ని నోటిఫికేషన్ వివరాలు, APY అకౌంట్ నెంబర్ వంటివి మనకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు సబ్స్క్రైబర్ మరణిస్తే ఈ స్కీమ్ ని తన భాగస్వామి కొనసాగవచ్చు. అది కూడా ఆ భాగస్వామి ఇష్టప్రకారమే.

మరింత సమాచారం తెలుసుకోండి: