జగన్ ఏడాది సీఎం, పొరుగున ఉన్న కేసీయార్ ఆరేళ్ళ సీఎం. ఇక మోడీ చూస్తే దేశానికి ఆరేళ్ళుగా ప్రధాని, అంతకు ముందు పుష్కర కాలం పాటు గుజరాత్ కి ముఖ్యమంత్రి, జగన్ తో పోలిస్తే కేసీయార్, మోడీల రాజకీయ, పాలనానుభవం చాలా ఎక్కువ. అయినా జగన్ వాళ్ళను ఎక్కడ దాటేశారు....ఎలా దాటేశారు...

 

అంటే చాలా విషయాల్లో అని చెప్పకతప్పదు. అసలు కరోనాను హ్యాండిల్ చేయడంతో జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. కరోనా ఫలనా టైంలోగా పోతుందని నమ్మబలుకుతూ మిగిలిన సీఎంలు డెడ్ లైన్లు పెట్టుకున్న రోజున జగన్ ఈ వైరస్ పోదు, కరోనాతో కలసి కాపురం చేయాల్సిందేనని కచ్చితంగా చెప్పి జాతీయ స్థాయిలోనే  ఆకట్టుకున్నారు.

 

ఇపుడు జగన్ చెప్పినట్లుగా కరోనా కధ నడుస్తోంది. ఇక  లాక్ డౌన్ కి స‌డలింపులు ఇస్తూ జన జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిందేనని కూడా జగన్ ప్రధానితో ముఖ్యమంత్రుల భేటీలో చెప్పారు. దాని ప్రకారమే ఇపుడు సడలింపులు ఇస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే దేశంలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉండడం విశేషం.

 

కరోనాని ఓ వైపు హ్యాండిల్ చేస్తూ ప్రభుత్వ  ఉద్యోగులకు పూర్తి జీతాలు కోత పెట్టకుండా జగన్ చెల్లించడం కూడా గొప్ప విషయమే. పొరుగున ఉన్న‌ తెలంగాణా సంపన్న రాష్ట్రంగా ఉంది. అయినా అక్కడ ఉద్యోగులకు సగం జీతమే అందుతోంది. కానీ జగన్ ఫుల్ పేమెంట్ ఇస్తున్నారు. ఇది ఘనతగానే చూడాలి. ఇక కొత్త పధకాలకు రాం రాం అంటూ కేంద్రం చేతులెత్తేసిన వేళ జగన్ మాత్రం ఏపీలో వచ్చే ఏడాది మార్చి వరకూ ఏకంగా సంక్షేమ క్యాలండర్ నే రిలీజ్ చేశారంటే ఆయన అందరి కంటే మొనగాడుగా చెప్పుకుంటున్నారు.

 

మరి ఇన్ని రకాల పధకాలు అమలు చేయడానికి జగన్ కి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులో ఉంటే జగన్ చేతికి ఎముక లేకుండా ఎలా పందేరాలు చేస్తున్నారు అంటే ఒక మాట చెబుతున్నారంతా.  జగన్ సంకల్పమే ఆయనకు బలం అని. ఏది ఏమైనా జగన్ ఏడాది కాలంలోనే పాలనలో అందరినీ మించిపోవడం గ్రేటే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: