క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. మొద‌ట చైనాలో పుట్టిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి.. ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో తెలియ‌క.. ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68 లక్షలు దాటింది. మ‌రోవైపు మ‌ర‌ణాలు నాలుగు ల‌క్ష‌ల‌కు చేరువలో నిలిచిందంటే.. ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి.

 

అయితే ఇలా క్ర‌మంలో క‌రోనా గురించి కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డంతో.. ప్ర‌జ‌లు మ‌రింత భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక తాజాగా బట్టతల ఉండే మగాళ్లకు కరోనా వైరస్ అత్యంత తీవ్రంగా ఉంటోందని పరిశోధనల్లో తేలింది. అమెరికాలో కరోనా వైరస్‌తో ఫిజీషియన్ డాక్టర్ ఫ్రాంక్ గాబ్రిన్ చనిపోయాక... మిగతా డాక్టర్లు పరిశోధించగా... ఆయనకు బట్టతల ఉండటం వల్ల కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. స్ప‌ష్టంగా చెప్పాలంటే.. బట్టతల ఉన్నవారికి కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువ అని, మ‌రియు బట్టతల ఉంటే... కరోనా తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ప‌రిశోధ‌కులు. ఇక స్పెయిన్‌లో కరోనాతో ఎక్కువగా మగాళ్లు చనిపోతున్నారు. అక్కడ కూడా బట్టతలకూ కరోనాకూ లింక్‌పై పరిశోధన చేయ‌గా.. అక్కడ కరోనా సోకిన మగాళ్లలో 79 శాతం మందికి బట్టతల ఉంది. 

 

అందువల్ల బట్టతల ఉండేవారు కరోనా విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అయితే వాస్త‌వానికి మగాళ్ల సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ వల్లే జుట్టు రాలిపోతుంది. అయితే అదే హార్మోన్ కరోనా వైరస్ కణాలపై దాడి చేసేందుకు శక్తిని ఇస్తుందని తాజాగా తేలింది. ఇప్పుడు బట్టతల ఉన్నవారికి కరోనా సోకితే... టెస్టోస్టీరాన్ హార్మోన్‌ను కంట్రోల్ చేసే ట్రీట్‌మెంట్ కూడా అందించడం మేలంటున్నారు డాక్టర్లు. అలాగే క‌రోనా సోకి చనిపోతున్న వారిలో ఎక్కువగా మగాళ్లే ఎందుకు ఉంటున్నారు అంటే.. మగాళ్ల లైఫ్‌స్టైల్, స్మోకింగ్ అలవాట్లు, జన్యుపరంగా మహిళలతో పోల్చితే మగాళ్ల జన్యువులు కరోనాను తట్టుకునే విషయంలో వీక్‌గా ఉండటం వంటి అంశాలు కూడా కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు.


   

మరింత సమాచారం తెలుసుకోండి: