గత రెండున్నర నెలలు గా దేశంలో కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.. అంతే కాదు ప్రజలు ఎవరు బయటకు రాకుండా పోలీసుల బందో బస్తు ఉంచారు.  ఎవరైనా లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకున్నారు.  దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌లు, వాహ‌నాలు వ‌దిలే పొగ, నిర్మాణ రంగానికి సంబంధించిన ఇత‌ర ప‌నుల కార‌ణంగా రాజ‌ధాని న‌గ‌రం ఎప్పుడు కాలుష్య‌భ‌రితంగా క‌నిపి‌స్తుంటుంది.  ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్ముకుని ఉద‌యం 8, 9 గంట‌లు అయితే త‌ప్ప 100 మీట‌ర్ల దూరంలోని వ‌స్తువులు క‌నిపించ‌ని ప‌రిస్థితి ఉంటుంది.

IHG

న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ నెల‌ల్లో అయితే రోడ్లు స‌రిగా క‌నిపించ‌క వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 22 నుంచి మే 18 మ‌ధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా త‌గ్గింది.  దాంతో ఢిల్లీలో పొల్యూషన్ ఓ మోస్తారు లో నిర్మూలించాం అనుకున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి 79 శాతం త‌గ్గింద‌ని సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) తెలిపింది. ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డటం, వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోవ‌డం, నిర్మాణ రంగ ప‌నులు ఆగిపోవ‌డం లాంటివి కాలుష్యం బాగా త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని సీఎస్ఈ వివ‌రించింది.

IHG

 కానీ ఎప్పుడైతే మళ్లీ లాక్ డౌన్ సడలించారో..  వాహ‌నాల రాక‌పోక‌లు, నిర్మాణరంగ ప‌నుల ప్రారంభం లాంటి మ‌రిన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ఢిల్లీతోపాటు దేశంలోని మ‌రికొన్ని ప్రధాన న‌గ‌రాల్లో కాలుష్యం స్థాయి తిరిగి  పెరిగింది. సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు లాంటి ఆరు ప్ర‌ధాని న‌గ‌రాల్లో PM 2.5 (వాయు కాలుష్య కార‌కం) స్థాయిలను స్ట‌డీ చేసింది. ఢిల్లీలో PM 2.5  స్థాయిలు 4 నుంచి 8 రెట్లు పెరుగ‌గా, ఇత‌ర న‌గ‌రాల్లో 2 నుంచి 6 పెరిగ‌న‌ట్లు వెల్ల‌డించింది. ఢిల్లీ మొద‌ట 97 శాతానికి త‌గ్గిన‌ PM 2.5 స్థాయి మే 18న ప‌లు‌ స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో 4 నుంచి 8 రెట్లు పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: