ప్రపంచం నలుమూలల కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిన విషయమే. కరోనా వైరస్ మన దేశంలో కూడా ఇప్పటివరకు రెండు లక్షల 35 వేల మందికి పైగా ఈ వైరస్ సోకి ఇబ్బంది పడిన వారే. అంతేకాకుండా దేశంలో ఈ రోజుకి 6600 మంది పైగా మృత్యువాత పడ్డారు. అయితే ఈ కరోనా వైరస్ నిర్మూలనం కోసం భారత ప్రభుత్వం ఐదవ సారి లాక్ డౌన్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలో అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు.

IHG


ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల దృష్ట్యా మధ్యలో కూడా కొందరు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అసలు విషయంలోకి వెళితే... తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా టంగుటూరు మండలం కైకరం వద్ద అ భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న 450 కేజీల గంజాయిని పోలీసులు సమాచారం తెలియడంతో స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ గంజాయి విశాఖపట్నం నుంచి తమిళనాడుకు లారీలో తరలిస్తున్న పోలీసులకు ముందుగా సమాచారం అందింది. ఇక ఈ సమాచారంతో పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్న పోలీసులు గంజాయి ఉన్నలారీని పట్టుకున్నారు. 

 


ఈ లారీని పోలీసులు అదుపులోకి తీసుకొని లారీ నడుపుతున్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని అతని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ ఏకంగా 20 లక్షల దాకా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చేబ్రోలు పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఒకవైపు దేశంలో కొందరు తిండి తిప్పలు లేక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఇలాంటి అసాంఘిక చర్యలు వల్ల మరో రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: