తిరుమల ఘాట్ రోడ్ లో ఓ దృశ్యం అందరినీ షాక్ కి గురి చేసింది.  నీటి కోసం రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   చిన్నా, పెద్ద ఏనుగులు మొత్తం దాదాపు ఓ పది దాకా ఉన్న గుంపు రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో రెండు, మూడు  నెలలుగా జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి.  ఇవే కాదు రాత్రి పూట ఎలుగు బంట్లు కూడా తిరుగుతున్న వీడియోలు వెలుగు లోకి వచ్చాయి. జన సంచారం లేకపోవడంతో ఖాళీ రోడ్లపైకి అడవి జంతువులు యదేశ్చగా బయటకు వస్తున్నాయి.

 

రాత్రివేళల్లో ఎలుగు బంట్లు చిన్న చిన్న జంతువులు గతంలో వచ్చాయి. ఇటీవల చిరుత పులి ఒకటి కనిపించగా.. తాజాగా ఏకంగా ఏనుగుల గుంపు సంచారం హడలెత్తించాయి. దీంతో వాటిని టీటీడీ ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.  మొదటి కనుమ రహదారిపై గజరాజులు రోడ్డు దాటుతూ కనిపించాయి. వాహనాలు తిరగకపోవడంతో ధైర్యంగా అటూ ఇటూ సంచరించాయి. ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోయాయి.

 

అయితే మరో 5 రోజుల్లో తిరుమలకు భక్తులను అనుమతించనున్నారు. ఈ సమయంలో ఇలా కృర, సాదు జంతువులు రోడ్లపైకి రావడం ఒకంత కలవర పెట్టే విషయమే అంటున్నారు. కాగా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై వన్యప్రాణులు బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఆంధ్ర, తమిళనాడు ఎలిఫెంట్ ట్రాకర్స్ రంగంలోకి దిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: