భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో  గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా సరిహద్దుల్లో భారీ మొత్తంలో సైనికులను మొహరించడం.. ఆయుధాలు వాడకుండా భారత సైనికులపై  రాళ్లు రువ్వడం లేదా చేతుల తో దాడి చేయడం లాంటి ఘటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు భారత్ కూడా సరిహద్దుల్లో భారీగానే సైన్యాన్ని మోహరించింది. ఈ క్రమంలోనే చైనా భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే గతంలో చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపిన విషయం తెలిసిందే. 

 


 ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా చైనా కు వార్నింగ్ ఇస్తూ భారత్కు పరోక్షంగా మద్దతు ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు  అనేటువంటివి సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా సరిహద్దులో సైన్యాన్ని భారీ మొత్తంలో ఎందుకు మొహరిస్తోంది అంటూ ప్రశ్నించారు. భారత్ ని బెదిరించాలని ఎందుకు ప్రయత్నం చేస్తోంది చైనా ప్రభుత్వం. ఉద్రిక్త పరిస్థితులు ఉండేలా ఎందుకు రెచ్చగొడుతుంది చైనా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పై ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే ట్రంపు వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 

 ఈ క్రమంలోనే ట్రంప్ పరోక్షంగా భారత్ కి సపోర్ట్ చేయడంతోపాటు చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చైనా కు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది చైనా . చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదాన్ని శాంతియుతంగానే పరిష్కరించుకుంటాము .. లడక్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన... తొలగించేందుకు మేము చిత్తశుద్ధితో ఉన్నామంటూ చైనా ప్రభుత్వం తెలిపింది. ఇరు దేశాల మధ్య సరిహద్దులు పరిస్థితి అదుపులోనే ఉందని భారత్కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ నఉన్నాము  అంటూ తెలిపారు. సమస్యను పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాం ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదు అంటు తెలిపింది చైనా . అయితే ట్రంప్  వ్యాఖ్యలపై దూకుడుగా  ఆలోచించకుండా జాగ్రత్తగా అతి తెలివిగా ముందడుగు వేసింది చైనా అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: