ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దు మధ్య గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా భారత్ మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుందో అనే విధంగా సరిహద్దుల్లో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. ఆయుధాలతో యుద్ధం జరిగక  పోయినప్పటికీ చైనా సైనికులు భారత సైనికులు మాత్రం ఒకరిపై ఒకరు చేతులతోనే దాడి చేసుకున్న  ఘటనలు  వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలా చైనా భారత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చైనా భారత్ మధ్య వివాదం తలెత్తడానికి కారణం ఏమై ఉంటుంది అనేదానిపై విశ్లేషకులు  ఏమంటున్నారంటే...భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యల తో రెచ్చిపోతునన్నది.  

 


 సరిహద్దులో చైనా భారీ మొత్తంలో సైనికులను మొహరిస్తుంది. అయితే చైనాకు అసలు శత్రువు ఏది అంటే అమెరికా అని చెప్పొచ్చు. అమెరికా చైనా మధ్య గతేడాది  వాణిజ్య పరమైన యుద్ధం నడిచింది. కరోనా  వెలుగులోకి వచ్చినప్పుడు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే చైనా సరిహద్దుల్లో ఎక్కడ వెనక్కి తగ్గలేదు అనే విషయం తెలిసిందే. ప్రధాని మోడీ సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరుపుతామని చెప్పినప్పటికీ చైనా ససేమిరా అన్నది. కానీ తాను మధ్యవర్తిత్వం వహిస్తాను  అంటూ చైనా భారత్ సరిహద్దు వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రావడంతో  చైనా కాస్త వెనక్కి తగ్గింది అని చెప్పాలి. ఆ వివాదాన్ని మేము చర్చలద్వారా సద్దుమణిగేలా చేసుకుంటామంటూ చైనా సమాధానం చెప్పింది.

 


 అంతేకాకుండా మే నెలలో అక్కడి సరిహద్దు ప్రాంతాలు చైనా బలగాలు చొచ్చుకొని వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత బలగాలు సైతం ఎదురు తిరగడంతో ఇరు దేశాల  సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే భారత్-చైనా మధ్య మంచి సంబంధం ఉంది. అదే కడుపుమంటతో ప్రస్తుతం చైనా భారత పై  యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే చైనా ఉహించిన  దానికంటే భారత్ ఎంతో దూకుడుగా వ్యవహరించడంతో ప్రస్తుతం చైనా చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఏకంగా దేశ ప్రధాని సైతం సైనిక అధికారులతో చర్చలు జరిపి  భారీగా సైనికులు మోహరించడంతో చేస్తే యుద్ధం చేయాలి లేద చర్చ జరపాలని ఈ నేపథ్యంలో చైనా చర్చలు సిద్ధమైనట్లు విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: