ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయా హైకోర్టులు విపరీతమైన షాకులు ఇవ్వడం బాగా అలవాటు చేసుకున్నాయి. జగన్ కు ఇప్పటికే నాలుగు విషయాల్లో షాక్ పైన షాక్ లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు కెసీఆర్ కు కరోనా విషయంలో చివాట్లు పెట్టిన తెలంగాణ హైకోర్టు మధ్య వ్యవహరిస్తున్న తీరును అందరం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేస్తూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టు పదవ తరగతి పరీక్షలకు సంబంధించి కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.

 

ముందుగా తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదవుతున్న హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి వీలులేదు అని హైకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను మొత్తానికే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జిహెచ్ఎంసి పరిధి మరియు రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే కరోనా వ్యాధి తక్కువగానే ఉన్న నేపథ్యంలో హైకోర్టు రెండు ప్రదేశాలకు పరీక్ష తేదీలను వాయిదా వేసుకోమని సూచించింది

 

తెలంగాణలో జూన్ 8 నుండి 10 తరగతి పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసిన నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనితో ప్రభుత్వం కేవలం పరీక్షలు మీదే దృష్టి సారించి విద్యార్థుల ప్రాణాలను కూడా పరిగణలోకి తీసుకోవట్లేదని హైకోర్టు కారి వాదన తో ఏకీభవించింది. వీలైతే పంజాబ్ తరహాలో పరీక్షలు లేకుండానే గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని పరిశీలించాలని చెప్పిన వారు చివరికి జిహెచ్ఎంసి మినహా మిగిలిన అన్ని చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని కోర్టు పరీక్షల నిర్వహణకు ఇలా అనుమతి నిరాకరించగా…. రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం కష్టమనే ఉద్దేశంలో ప్రభుత్వం పూర్తిగా వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: