2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా తయారైందో చూస్తూనే ఉన్నాం. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వీక్ అయిపోయింది. దీనికితోడు పలు నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ నేతలంతా క్యూ కట్టేసి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందు చంద్రబాబు...కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లని నియమించారు.

 

అలా కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గానికి రావి వెంకటేశ్వరరావుని మళ్ళీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. కానీ పక్కనే ఉన్న గన్నవరం నియోజకవర్గానికి మాత్రం ఇన్‌చార్జ్‌ని నియమించలేదు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఆ పార్టీని వీడి జగన్‌కు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే వంశీ 2014లోనే గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి స్వల్ప మెజారిటీతో విజయం అందుకున్నారు.

 

అయితే చంద్రబాబు విధానాలు నచ్చక, ఆయన వైసీపీ వైపు వచ్చేశారు. టెక్నికల్‌గా ఎమ్మెల్యే పదవి పోకుండా చూసుకుంటూనే, వైసీపీకి మద్ధతు తెలిపారు. వంశీ టీడీపీని వీడటంతో ఆ పార్టీకి అండగా ఉండే నాయకుడు లేకుండా పోయాడు. బాబు కూడా ఇన్‌చార్జ్‌ని కూడా నియమించలేదు. కాకపోతే గన్నవరం నియోజకవర్గానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధా, కృష్ణా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎన్‌ఆర్‌ఐ పుట్టగుంట సతీశ్ కుమార్‌ల్లో ఒకరికి ఇన్‌చార్జ్ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయిగానీ, అదేమీ జరగలేదు.

 

ఇంకా చంద్రబాబు ఇన్‌చార్జ్‌గా ఎవరిని నియమించలేదు. అయితే వీరిలో ఎవరు ఇన్‌చార్జ్‌గా వచ్చిన వంశీని ఢీకొట్టడం కష్టమని తెలుస్తోంది. ఎందుకంటే వంశీకి గన్నవరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీలకుండే ఇమేజ్‌తో పాటు వంశీకి సెపరేట్ ఇమేజ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగో వైసీపీ నుంచే పోటీ చేస్తారు. కాబట్టి ఆ పార్టీ ఇమేజ్, తన సొంత ఇమేజ్ కలిస్తే వంశీని ఓడించడం చాలా కష్టం. మొత్తానికైతే టీడీపీకి వంశీని ఢీకొట్టే కష్టమే అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: