కరోనా వల్ల ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు దారుణంగా ఉండటంతో చాలా వరకు విద్యా వ్యవస్థలు ఆన్ లైన్ క్లాసుల దిశగా అడుగులు వేస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ మరియు కాలేజీ లు ఆన్ లైన్ తరగతులు నిర్వహించి పిల్లలకు విద్యా పాఠాలు చెప్పడం జరిగింది. అయితే ఈ తరుణంలో పేదవాళ్ళు ఇటువంటి తరగతులకు దూరమవడం జరిగింది. కనీస స్మార్ట్ ఫోన్ గాని లాప్ టాప్ గాని లేకపోవడంతో ఆన్ లైన్ తరగతులకు హాజరుకాకలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ సరికొత్త ఐడియాతో ముందుకు వస్తోంది.

 

సీఎం జగన్ ఇప్పటికే పేదవాడి జీవితానికి విద్య అనేది భారం కాకూడదని పిల్లల పాఠశాల విషయంలో అలాగే చదువుతున్న కళాశాల విద్యార్థుల కోసం  అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆన్ లైన్ పాఠాలకు పేద విద్యార్థుల దూరం కాకూడదని రాష్ట్రవ్యాప్తంగా గురుకుల సొసైటీలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా సెల్ ఫోన్లను ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దాదాపు 60 వేల మంది ఈ పథకంలో లబ్ధిదారులు కానున్నట్లు ఒక విద్యార్థికి ఐదారు వేల రూపాయలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. రానున్న రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు ఫాలో కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి.

 

ఈ నేపథ్యంలో  రాష్ట్రంలో 60 వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్లు అందించాలని నిర్ణయించారు. అయితే ఈ విషయంలో మరోపక్క విమర్శలు వినబడుతున్నాయి. ఐడియా బాగున్నా గాని పిల్లల చేతికి సెల్ ఫోన్ వెళ్లిన తర్వాత అనవసర విషయాలకు టైం వేస్ట్ చేస్తారని ఈ విషయంలో ఏపీ ర్కార్ కొద్దిగా ఆలోచించాలని మేధావులు, మరి కొంతమంది పిల్లల పేరెంట్స్ అంటున్నారు. ఏమాత్రం విషయం తేడా అయినా విద్యార్థి జీవితం ప్రమాదంలో పడటంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు దారుణంగా వస్తాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: