గడచిన మూడు నెలల్లో కరోనా విజృంభణ వల్ల ప్రపంచ దేశాల పరిస్థితి మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువలో ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. చైనా, ఇటలీ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను కనిపెట్టాయి. 
 
వ్యాక్సిన్ కు సంబంధించిన మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. పూర్తి స్థాయి పరిశోధనల ఫలితాల తర్వాత వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో తెలియాల్సి ఉంది. మరోవైపు మన దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. పలు కంపెనీల వ్యాక్సిన్లు ఇప్పటికే సిద్ధం కాగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 
 
అయితే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఐతే అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో భారత్ లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మన దేశంలో ఆయుర్వేద వైద్యంలో ఒక మెడిసిన్ క్లినికల్ ట్రయల్స్ స్టేజ్ కు వచ్చింది. ఆస్తా 15 అనే పేరుతో ఈ మెడిసిన్ ను తయారు చేశారు. కరోనా చికిత్స కోసం పాలీ హెర్బల్ కాంబినేషన్ తో రూపొందించిన ఆస్తా 15 వైరస్ ను నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తోందని చెప్పారు. 
 
ఈ మెడిసిన్ పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని దాల్మియా హెల్త్ కేర్ సంస్థ తాజాగా ప్రకటన చేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. కరోనాను నయం చేయడంలో అత్యంత సమర్థవంతంగా ఆస్తా 15 పని చేస్తుందని వారు చెబుతున్నారు. ఈ మెడిసిన్ ఇప్పటికే చెన్నైలోని కొంతమంది కరోనా రోగులపై పరీక్షించారు. ఈ మెడిసిన్ వల్ల దుష్ప్రభావాలు ఏమీ లేవని సంస్థ చెబుతోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే ఈ మెడిసిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: