గత నెల రోజులుగా చైనా భారత్ సరిహద్దు వివాదం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తుండగా మరోవైపు ఈ వివాదం గురించి వదంతుల ప్రచారం జరుగుతోంది. ఈరోజు చైనా భారత్ దేశాల లెఫ్టినెంట్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. సమస్యలను పరిష్కరించుకునే దిశగా తొలి అడుగు పడింది. భారత్ సామరస్యపూర్వకంగానే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తోంది. 
 
వివాదానికి కారణమైన లడఖ్ సెక్టార్ లో ఈరోజు ఉదయం చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్ తరపున హరీందర్ సింగ్ చైనా తరపున లియు చర్చలకు హాజరయ్యారు. చర్చల్లో భారత్ తొలి వాదనను వినిపించిందని... చర్చలకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరించిందని తెలుస్తోంది. సరిహద్దుల్లో ఏప్రిల్ ముందు నాటి పరిస్థితులు ఉండేలా చూడాలని చెప్పారు. సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. 
 
అయితే చైనా భారత్ సరిహద్దు వివాదం గురించి జరుగుతున్నది ఒకటి అయితే ప్రచారంలో ఉన్నది మరొకటి అని తెలుస్తోంది. సరిహద్దుల్లో జరుగుతున్న వాటి గురించి ఎవరి దగ్గర పూర్తి సమాచారం ఉండదు. చైనా ప్రస్తుతం లడఖ్ దగ్గర ఉన్న ప్రాంతంలో సైన్యాన్ని మోహరించింది. భారత్ కూడా అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఇరు దేశాల సైన్యం వెనక్కు వచ్చేసింది. 
 
చైనా 20 కిలోమీటర్లు ఆక్రమించిందని... కేంద్రం నిర్లక్ష్యం వహించిందని.... చైనా గెలిచిందని రకరకాల వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనా గాల్వాన్ నదీ జలాలను మళ్లిస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ వదంతుల్లో ఎలాంటి నిజం లేదు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం నీటి పంపకాలు జరుగుతున్నాయి. కొందరు వైరల్ చేస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉండటం గమనార్హం.         

మరింత సమాచారం తెలుసుకోండి: