ఏపీ సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య ఉన్నది స్నేహమా లేక వైరమా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కొన్ని సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంతో సఖ్యత గా ఉంటూ వస్తున్న కేంద్రం, కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తూ తమ రాజకీయ ప్రత్యర్థిగా చూస్తోంది. అలాగే ఏపీ బిజెపి నాయకులు సైతం జగన్ ను అదేపనిగా విమర్శిస్తూ, రాజకీయంగా అభాసుపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి కేంద్ర బిజెపి పెద్దలు జగన్ పిలిచి మరి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుతుండగా, ఒక్కొక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చిన చివరి నిమిషంలో దానిని రద్దు చేసి అభాసుపాలు చేస్తున్నారు. దీంతో అసలు జగన్ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు ఏ వైఖరితో ఉన్నారనే విషయం గందరగోళంగా మారింది. 

IHG


ఈ విషయంపై ఏపి బిజెపి నాయకులు, అలాగే వైసిపి నాయకులకు అనేక సందేహాలు ఉన్నాయి. ప్రధాని జగన్ విషయంలో ఏ ఆలోచనతో ఉన్నారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీలో వైసిపి సాధించిన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల ప్రకారం నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు వైసీపీ మద్దతు కూడా కేంద్రానికి అవసరం. ఆ ఆలోచనతోనే కేంద్రం కొన్ని కొన్ని విషయాల్లో వైసిపీకి దగ్గరగా ఉన్నట్టుగానే వ్యవహరిస్తోంది. మరో వైపు చూస్తే వైసీపీ కి బద్ద శత్రువు జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలోనూ ఒక్కోసారి సానుకూలంగా స్పందిస్తూ ఉంటుంది.

 


 అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ జగన్ గురించి సానుకూలంగా మాట్లాడారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ పనితీరు పదేపదే మెచ్చుకున్నారు. జగన్ చేసిన కొన్ని సూచనలను మోదీ దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం జగన్ విషయంలో మొదటినుంచి భిన్న వైఖరిని అవలంబిస్తూ వస్తున్న తీరు, ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది. దీంతో అసలు జగన్ విషయంలో మోదీ సానుకూలంగా ఉన్నారా ?  అసలు ఏ ఉద్దేశంతో ఉన్నారనే విషయంపై సీఎం జగన్ కు కూడా అనేక సందేహాలు నెలకొన్నాయి, ఈ సందేహాలకు స్పష్టత ఎప్పుడు వస్తుందో రానున్న రోజుల్లో చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: