పంజాబ్ మాజీ మంత్రి, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. సీఎం కేజ్రీవాల్ సిద్ధూ తమతో కలిసి పని చేస్తే బాగుంటుందని తాజాగా వ్యాఖ్యలు చేశారు. 2016 సంవత్సరంలో సిద్ధూ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 
 
అప్పటినుంచి ఇప్పటివరకు సిద్ధూ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాడు. సిద్ధూ ఈ విషయం గురించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో సిద్ధూ ఆప్ లో చేరతాడని... పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వస్తే కాబోయే సీఎం సిద్ధూనేనని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఉన్న సమయంలో సిద్ధూ పంజాబ్ లో ఒక వెలుగు వెలిగాడు. 
 
ఆ తరువాత సిద్ధూ ముఖ్యమంత్రి కావాలనే కోరికను బీజేపీ అధిష్టానానికి చెప్పటం.... అకాలీదత్ తో బీజేపీకి పొత్తు ఉండటంతో ఆ పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ స్పష్టం చేయడం జరిగింది. బీజేపీ సీఎం చేయడానికి అంగీకరించకపోవడంతో సిద్దూ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సిద్ధూ భావించారు. కానీ కాంగ్రెస్ మాత్రం మంత్రి పదవితో సరిపెట్టింది. 
 
దీంతో కాంగ్రెస్ పార్టీ తో అంటీ ముట్టనట్టుగా సిద్ధూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆప్ కు ఎన్నికల వ్యూహకర్గగా ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. కేజ్రీవాల్ రాష్ట్రాల వారీగా ఆప్ ను విస్తరించాలని భావించి సిద్ధూను అధ్యక్షుడిగా నియమించి పంజాబ్ లో గెలవాలని భావిస్తోంది. అతి త్వరలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్ లో అధికారంలోకి తీసుకొస్తాడో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: