తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ. అయితే సూపర్ స్టార్ కృష్ణ కేవలం హీరోగానే కాకుండా పొలిటికల్ కూడా రాణించారు.. ఒకప్పుడు కృష్ణ పార్లమెంటు సభ్యుడిగా గెలిచి ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగగా ఓడిపోయారు. విజయనిర్మల కూడా టిడిపి నుంచి కైకలూరులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం కృష్ణ తనయుడు మహేష్ బాబు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా  వెలుగొందుతున్నాడు. అయితే తనకు రాజకీయాల పై ఎలాంటి ఆసక్తి లేదని వచ్చే ఉద్దేశం లేదు అంటూ గతంలో క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు. 

 


 అయితే కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరిరావు కృష్ణ సోదరుడిగా అందరికీ తెలుసు. పొలిటికల్ గా మాత్రం ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. అంతకు ముందు వరకు వైసిపి పార్టీలో కొనసాగిన కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు 2019 ఎలక్షన్ ల  ముందు టిడిపి పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత టిడిపి పార్టీలో కూడా ఎక్కడా తెరమీద కనిపించే లేదు ఆదిశేషగిరిరావు. అయితే తాజాగా ఆదిశేషగిరిరావు వైసిపి పార్లమెంట్ సభ్యుడు కీలక నేత అయిన విజయసాయి రెడ్డి ని కలవడం ప్రస్తుత ఆంధ్రా రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గతంలో గుంటూరు ఎంపీ కలేదా  విజయవాడ నుంచి ఎంపీగా సీటు సంపాదించాలి అనుకున్నారు. 

 


 అయితే వైసీపీలో చేరడం ద్వారా రాజకీయంగా మేలు జరుగుతుందని విజయసాయిరెడ్డి తో సమావేశం అయ్యారు అని కొంతమంది చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో  రాజ్యసభ సీటును కూడా దక్కించుకోవడానికి.. ఇప్పటినుండే  మంతనాలు జరుపుతున్నారు అన్నట్టు వంటివి  మరొక వాదన వినిపిస్తోంది. అయితే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కు ఎలాంటి మాస్ ఫాలోయింగ్  లేదు అనే విషయం తెలిసిందే. మరో ముఖ్య విషయం ఏమిటంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకి ప్రత్యేకించి సీటు ఇచ్చే ఉద్దేశం జగన్కు లేదు అని అటువంటిది ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దీనిపై మాత్రం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: