మన భారతదేశానికి ఇంతవరకు ఒక పాకిస్దాన్‌తోనే ప్రమాదం అనుకుంటే తాజాగా చైనా కూడా ప్రమాదకారిగా మారుతుంది.. ఇప్పటికే తన వెకిలి చేష్టలతో భారత్ బార్డల్లో అల్లకల్లోలం సృష్టించడానికి సన్నహాలు చేస్తుంది.. ఇందులో భాగంగా నేపాల్‌ను కూడా లొంగదీసుకుంది.. ఇక ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఏర్పడింది.. ఒక వేళ చైనా మనపై యుద్ధాన్ని ప్రకటించడానికి ముందే ఆ దేశాన్ని ఆర్ధికంగా దెబ్బతిసే అవకాశం మన భారతీయుల చేతుల్లో ఉందట..

 

దీనికంటే ముందు చెప్పుకోవలసిన విషయం ఏంటంటే.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పై అణుబాంబు వేసినప్పుడు జపాన్ దేశానికి అపార జన, ఆస్తి నష్టం వాటిల్లింది, కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది, అందుకు కోపంగా జపాన్ ప్రజలు ఈరోజు వరకు అమెరికా ఉత్పత్తులు కొనడం మానేసారు.. అమెరికా కు జపాన్ తో వాణిజ్య సంబంధాలు ఈరోజుకు కూడా చక్కబడలేదు అది జపాన్ ప్రజల ఐక్యత..  ఓ చుక్క రక్తం చిందించకుండా అమెరికా పై నైతికంగా, ఆర్థికంగా గెలిచి చూపించారు.. ఇక ఇక్కడ మన భారతీయులు చైనా విషయంలో చాణక్యనీతిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

 

అదెలా ఉంటుందో ఒకసారి ఈ చిన్న కధను వింటే మీకే అర్ధం అవుతుంది.. ఒకరోజు చాణక్యుడు తన శిష్యులతో పాటు సంధ్యావందనం కోసం నదిదికి వెళ్లుతుండగా తని కాలికి ఒక ముళ్ళచెట్టుకు ఉన్న ముళ్లు గుచ్చుకుందట..అది చూసిన శిష్యులు ఆ ముళ్ళచెట్టు మీద కోపంతో దానికి పీకడానికి ప్రయత్నించగా, చాణిక్యుడు వారిని వారించి కాస్త బెల్లం తీసుకురమ్మన్నారు.. శిష్యులు తెచ్చిన బెల్లంకు కొంచెం నీటిని కలిపి చిక్కగా చేసి ఆ ముళ్ళచెట్టు మొదట్లో కాండంకు పోసారట... అతను ఏం చేస్తున్నాడో అర్ధం కాని శిష్యులు బిక్కముఖం వేసారట..

 

ఇక మరుసటి రోజు చాణిక్యుడితో సంధ్యావందనంకు వెళ్లుతున్న శిష్యులు ఆ ముళ్ళచెట్టును చూసి ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే ఆ ముళ్ళచెట్టు కాండంను చీమలు పూర్తిగా కొరికి చెట్టునుండి కాండంను వేరుచేసాయి.. ముళ్ళచెట్టు నిర్జీవంగా పడి ఉంది. ఇక్కడ గమనించవలసిన నీతి ఏంటంటే శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు అతను చేసే నష్టం అంచన వేయడం కష్టం కాబట్టి మనమీద అనుమానం రాకుండా, మనకు నష్టం కలగకుండా మట్టుబెట్టే విధానం గురించి మనకు ముందు తెలిసి ఉండాలి. అంతిమంగా అది మంచికై ఉండాలి.. ఇదే చాణక్య నీతి! ఇక ఈ ముచ్చట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. ఈ మధ్య మనదేశంపై చైనా కవ్వింపు చర్యలు ఎక్కువయ్యాయి. అంతే కాదట మనదేశంలో ఉండే చైనీయులందరినీ వెనక్కిరమ్మని చెప్పిందని ఓ పుకారు హల్ చల్ చేస్తుంది.

 

అంటే క్రమంగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని మనకు అర్థం అవుతుంది.. అందుకే చైనా వస్తు బహిష్కరణ అనే ఆయుధాన్ని ఇప్పుడు మనం వాడవలసిన అవసరం వచ్చింది.. జపాన్ అవలంభిస్తున్న విధానమే మన భారతీయులు పాటిస్తే చైనా ఆర్ధిక వ్యవస్ద మీద మనం దెబ్బకొట్టినట్లే అని అంటున్నారట. ఇక ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఏ దేశమైనా తమ దేశంలో మరో దేశ ఉత్పత్తులను అమ్ముకోడానికి నిరాకరించకూడదు.. అందువల్ల మన దేశంలోకి వచ్చే చైనా ఉత్పత్తులను ఆపలేం.. అలాగని ఖచ్చితంగా కొనవలసిందే అని నిబంధనలు లేవు.. కాబట్టి కొనడమా? మానడమా? అన్నది మన ఇష్టం..

 

ఇక చైనా ఉత్పత్తులు మనదేశంలో అమ్ముడు పోయినంతగా మరే దేశంలో అమ్మడుపోవు.. ఒకరకంగా చెప్పాలంటే చైనాకు మనదేశమే ప్రధాన ఆదాయ వనరు.. అందుకే ఐకమత్యంగా సైలెంట్ గా చైనా వస్తువులను బహిష్కరిస్తూ కొనడం మానేస్తే సరి. చైనాను మనం ఆర్ధికంగా నష్టపరచినట్టే.. మనం మన దేశానికి ఎంతో మేలు చేసినట్టే.. మనం ఆ పని చేయలేమా? అంతటి దేశభక్తి, ఐక్యత మనకు లేదా? విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులను మాత్రమే వాడుకునే అలవాటూ మన దేశం కోసం చేసుకోలేమా.. అని నెటిజన్స్ ఇప్పటికే ఇలా ఆలోచించడం మొదలు పెట్టినారట.. అంతే కదా మనదేశం కోసం సైనికులం కాలేకపోయాం కనీసం ఇలాగైనా రక్షకులం అవుదామని అంటున్నారట కొందరు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: