ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా భారీ మొత్తంలో సైనికులను సరిహద్దులో మోహరించడం తో... అటు భారత సైన్యం కూడా భారీ మొత్తంలో అక్కడ మోహరించింది. ఈ సమయంలో చైనా భారత్ మధ్య ఏ క్షణాన యుద్ధం జరుగుతుందో అన్నరీతిలో అక్కడ పరిస్థితి హాట్ హాట్ గా మారిపోయింది. అంతే కాకుండా కొంతమంది చైనాకు చెందిన సైనికులు భారత సైనికుల పై దాడులకు పాల్పడుతున్నారు భారత సైనికులు వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టడం కూడా  జరుగుతుంది సరిహద్దుల్లో . ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో  ఎప్పుడు ఎలాంటి ఘటన చోటు చేసుకుంటుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 

 అయితే ప్రస్తుతం భారత్ చర్చలు జరిపేందుకు చైనా సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో  ముఖ్యంగా నాలుగు అంశాలపై అటు చైనాకు భారత్ కు పట్టు ఉంది అంటున్నారు విశ్లేషకులు. చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదం లో కీలకమైన అంశాలు ఏమిటి అంటే.. పాంగోంగ్ సో సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో గోగ్రా  హార్ట్  సెల్లింగ్  ప్రాంతం, కాల్ వన్ వాలి ప్రాంతం సహా పలు పాయింట్ల దగ్గర ఘర్షణలకు సంబంధించి ఒక క్లారిటీ రావాలి. అయితే పాయింట్  1 నుంచి 8 ప్రాంతాలలో.. ఎవరు రాకూడదు అయినటువంటి ప్రస్తుతం చైనా చర్చల్లో తెరమీదికి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ పాయింట్ 4 వద్ద   ఎంతో బలంగా ఉంది. 

 


 మరో విషయం ఏమిటి అంటే ఈ రెండు దేశాలకు చెందిన సైన్యాలు ఎదురు పడినప్పుడు ఎలా ప్రవర్తించాలి. నో మ్యాన్ జోన్  దగ్గర ఎదురుపడినప్పుడు ఇరుదేశాల సైన్యాల మధ్య మాటల యుద్ధం నడిచింది  చేతుల వరకు వెళుతుంది. అయితే ఎదురు పడ్డప్పుడు  ఇరు దేశాల సైన్యం ఎలా ప్రవర్తించాలి అనేదానిపై కూడా చర్చించనున్నారు. అయితే ఇటు సరిహద్దులో నిర్మాణాలు మీరు ఆపేయండి మేము కూడా ఆపేస్తా అనే ఒక వాదన తెరపైకి తెచ్చింది చైనా  .  చైనా అయితే ప్రస్తుతం కొన్ని పాయింట్లు ముందుకొచ్చింది. దీంతో ఇక్కడే తిష్ట వేస్తాం అనే వాదన చైనా చెబుతుండగా లేదు మీరు ముందు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడికి వెళ్ళండి మేము కూడా వెనక్కి వెళ్తామని భారత్ వాదన వినిపించనున్నట్లు  తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నాలుగు పాయింట్లు మీద చర్చ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: