వైయస్ జగన్ పరిపాలన విషయంలో ప్రజలలో సానుకూల స్పందన ఉంటే మరోపక్క పార్టీలో నుండి అసమ్మతి సెగలు వినబడుతున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై బహిరంగంగా మీడియా ముందు విమర్శలు చేయటం ఇటీవల ఎక్కువైపోతున్నాయి. గత నెల రోజుల్లో చూస్తే వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జగన్ ఏడాది పాలన పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగన్ ఏడాది పాలనలో అధికారుల నిర్లక్ష్యం పై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.IHG

ఇదే  టైంలో గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మం నాయుడు జడ్పీ సమావేశంలో ఇసుక విధానం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇసుక దొరకడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులు చేసినా లాభం లేకుండా పోయిందని పార్టీ పరువు తీసే విధంగా కామెంట్లు చేయడం జరిగింది. ఇసుక విధానంలోనే చాలావరకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

IHG

అంతేకాకుండా జగన్ ఏడాది పరిపాలనలో ఎక్కువగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కంటే వైసీపీ ఎమ్మెల్యేల నుంచి పాలనపై ఫిర్యాదులు రావడం ఆసక్తికరం. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ప్రజాప్రతినిధులను అందరిని దారిలోకి తీసుకురావటానికి వైయస్ జగన్ డిసిప్లినరీ కమిటీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ పార్టీలో టాక్. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడంతో ప్రతిపక్షాలు మీడియా కూడా ఏడాది పరిపాలన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: