పార్లమెంటులో దేశంలోనే అతిపెద్ద పార్టీగా నాలుగో స్థానంలో ఉంది వైసిపి. అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా జాతీయస్థాయిలో ఇప్పటికే కొన్ని విషయాల్లో కీలక భూమిక పోషించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో వైయస్ జగన్ పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటున్నట్లు పలు జాతీయ సర్వే లలో తేలింది. అంతే కాకుండా తాజాగా ‘సి ఓటర్’ సర్వే లలో ఇటీవల వైయస్ జగన్ దేశంలో బెస్ట్ సీఎం లలో నాలుగో స్థానం దక్కించుకోవడం అందరికీ తెలిసిందే. ఈ విధంగా వైయస్ జగన్ రోజురోజుకీ జాతీయ స్థాయిలో కీలక నేతగా రాణిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పేది జగనే అని ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

ఇదిలా ఉండగా త్వరలో రాజ్యసభ ఎన్నికలలో వైసీపీ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉండటంతో మరింతగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతో జగన్ కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు, ఇప్పటికే ఈ వార్త బాబు గారికి లీక్ అయినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ లాంటి భయంకరమైన విపత్కర సమయంలో లాక్ డౌన్ టైం లో జగన్ తీసుకున్న నిర్ణయాలనే ఎక్కువగా కేంద్రం ఫాలో అవ్వడం మనకు అందరికీ తెలిసిందే. వైరస్ ప్రభావిత ప్రాంతాలను రెడ్ గ్రీన్ జోన్ ల ఐడియా ని జగన్ ముందు పైకి తీసుకురాగా తర్వాత కేంద్రం తెరపైకి తీసుకు వచ్చింది.

 

అలాగే టెలీ మెడిసిన్ జగన్ ఐడియా ని ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ అమలు చేయడానికి రెడీ అవ్వడం చూస్తున్నాం. ఈ విధంగా చాలా విషయాలలో ముందుచూపుతో జగన్ నిర్ణయాలు ఉండటంతో త్వరలోనే జాతీయ స్థాయిలో కూడా జగన్ కి మోడీ ప్రముఖ స్థానం ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఇటీవల చంద్రబాబు దాక రావటంతో ఆయన టెన్షన్ లో ఉన్నట్లు టాక్. ఇప్పటికే సొంత పార్టీలో రాష్ట్రంలో ఉన్న కొద్ది క్రేజు తగ్గిపోతున్న తరుణంలో మరో పక్క జగన్ జాతీయ స్థాయిలో కీలకం అవుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కూడా  ఈ వార్త వెన్నులో వణుకు పుట్టిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: