దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ఇవ్వడం తో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇక ఈఒక్క రోజే దేశ వ్యాప్తంగా 10000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అందులో అత్యధికంగా మహారాష్ట్ర లో 2739, తమిళనాడులో 1478, ఢిల్లీలో 1320, పశ్చిమ బెంగాల్ 435, గుజరాత్ లో 498 కేసులు నమోదయ్యాయి. ఇక కొన్నిరోజుల ముందువరకు అసలు కేసులు లేని గోవాలో ఈ ఒక్క రోజే 71కేసులు బయటపడ్డాయి దాంతో మొత్తం కేసుల సంఖ్య 267కు చేరింది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 210కేసులు నమోదు గా మొత్తం కేసుల సంఖ్య 3588కు చేరింది. ప్రస్తుతం 1192కేసులు యాక్టీవ్ గా ఉండగా కరోనా వల్ల ఇప్పటివరకు 73మంది మరణించారు. మరోవైపు తెలంగాణ లో ఈరోజు ఏకంగా 206 కేసులు బయటపడ్డాయి. సింగల్ డే లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ . ఒక్క జీహెహ్ఎంసి లోనే 152కేసులు నమోదయ్యానట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
కరోనా విజృంభిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఈనెల 8నుండి జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు వాయిదావేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో పరీక్షలను నిర్వహించేలా కనిపించడం లేదు. అటు కేసులు మాత్రమే కాదు రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా ఎక్కువతున్నాయి. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 10మంది మరణించారు దాంతో మరణాల సంఖ్య 123కు చేరింది. ఓవరాల్ గా ఇండియాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 244000 దాటగా 6800 మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: