దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఈ కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షల వరకూ ఉంది. కేసులు పెరిగే జోరు కూడా పెరుగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరీ భయంకరంగా ఉంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. ఇక కరోనా విషయంలో ఇండియా పరిస్థితి ఇటలీ, స్పెయిన్ లా మారుతుందా అన్న ఆందోళనలు కూడా కలుగుతున్నాయి.

 

 

ఓవైపు కేసులు పెరుగుతుంటే.. మరోవైపు.. లాక్ డౌన్ నిబంధనలు ఒక్కొక్కటిగా సడలిస్తున్నారు. ఈ పరిస్థితి ఇంకా భయం గొలుపుతోంది. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ఓ గుడ్ న్యూస్ మాత్రం భారతీయలకు ఊరట కలిగించేలా ఉంది. అదేంటంటే.. ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇప్పటికే ఇలాంటి వారి సంఖ్య లక్ష దాటడం నిజంగా శుభవార్తే.

 

 

ఎందుకంటే.. కరోనా బారిన పడి చివరి స్టేజ్‌లో ఉన్నవారు ప్లాస్మా చికిత్స ద్వారా కోలుకుంటున్నారు. ప్లాస్మా చికిత్స అంటే.. కరోనా వచ్చి నయం అయిన వారి రక్తం నుంచి ప్లాస్మా సేకరించి దాన్ని రోగి శరీరంలోకి పంపుతారన్నమాట. ఈ చికిత్స ద్వారా వందల మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఇప్పటికే కోలుకున్న వారి సంఖ్య లక్ష దాటినందవల్ల వీరందరి రక్తం నుంచి ప్లాస్మా సేకరించే అవకాశం లభించింది.

 

 

అంటే వీరంతా ఆపత్కాలంలో ఆపద్భాంధవులుగా మారొచ్చన్న మాట. మరోవైపు కరోనా నుంచి లక్ష మంది వరకూ కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఈ శుభవేళ సందర్భంగా కోవిడ్ పై నిరంతరం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది అందరినీ అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: