టీటీడీ ఇటీవల బాగా వార్తల్లోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూములు అమ్మేస్తున్నారన్న వార్తలు వచ్చాక టీటీడీ బాగా హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా జాతీయ మీడియా కూడా ఈ అంశంపై చర్చలు చేపట్టింది. దీనికి తోడు సోషల్ మీడియా ఒకటి ఉండనే ఉంది. ఇందులో అనేక ఫేక్ వార్తలు టీటీడీ గురించి బాగా సర్క్యులేట్ అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని.. భూములు అమ్మడం లేదని ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

 

 

అంతేనా.. ఈ భూముల అమ్మకానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం హయాంలో తీసుకున్న తీర్మానాన్ని కూడా నిలిపేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం టీటీడీపై బాగా దుష్ప్రచారం జరుగుతోందట. అసలు సోషల్ మీడియా అంటేనే అదిగో పులి అంటే..ఇదిగో తోక అనే బాపతు.. అందుకే అలాంటి ప్రచారాలపై టీటీడీ కూడా చర్యలు తీసుకుంటోంది. అయితే అందులో భాగంగానే.. తమిళ నటుడు, హీరోలు సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ పైనా టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

 

శివకుమార్ తో పాటు ఎనిమిది మందిపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరంతా.. టిటిడి ప్రతిష్ట దెబ్బతినేలా , శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారనేది అభియోగం. టిటిడి సభ్యురాలు సుధా నారాయణమూర్తి టిటిడి నుంచి వైదొలిగారని ఒక పోస్టు... సప్తగిరి పత్రిక ఛీప్ ఎడిటర్ ను, ఇతర సిబ్బందిని కూడా తొలగించారని మరో పోస్టు ఇలా అసత్యాలతో కూడిన పోస్టులు చాలా గుర్తించారు. వారిపై కేసులు పెట్టారు. వీరిపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు.

 

 

అయితే నటుడు సూర్య తండ్రి శివకుమార్ మాత్రం.. సామాన్య భక్తులను ఒకలాగ, వీఐపీలను మరోలాగా తిరుమలలో ట్రీట్ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు ఆయనకు కూడా టీటీడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: