లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో రేపటి నుంచి చాలా చోట్ల ఆలయాల తలుపులు తెరుచుకోనున్నాయి. మళ్లీ భక్తులతో ఆలయాల్లో సందడి కనిపించబోతోంది. అయితే కరోనా నేపథ్యంలో కొన్ని నిబంధనలు మాత్రం పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. భక్తుల ఆరోగ్యం కోసం కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.

 

 

సాధారణంగా గుడి వెళ్తే.. తీర్థ ప్రసాదాలు పెడతారు. అలాగే దేవుని శఠగోపం భక్తుల నెత్తిన పెడతారు. ఇవి గుడికి వెళ్లిన ఆనందాన్ని కలిగిస్తాయి. భక్తుడికి అనిర్వచనీయమైన అనుభూతి ఇస్తాయి. అయితే కరోనా కారణంగా ఇప్పుడు ఇలాంటివేవీ ఉండవు. దర్శనం అంటే దర్శనం చేసుకోవాలి.. అంతే.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శఠగోపం, తీర్థప్రసాదాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు.

 

 

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు కేంద్ర అనుమతులు ఇచ్చిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేసిందని వారు వివరిస్తున్నారు. రేపటి నుంచి ఏపీలో చాలా ఆలయాలు తెరుచుకుంటున్నాయి. అయితే ఈనెల 8, 9 తేదీల్లో అన్ని ఆలయాల్లో ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత 10 నుంచి నిబంధనల ప్రకారం భక్తులకు దర్శనం కల్పిస్తారు.

 

 

మాస్క్‌ ఉన్నవారినే ఆలయాల్లోకి అనుమతిస్తారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న ఆలయాల్లోకి భక్తులను అనుమతించరు. భక్తులంతా కచ్చితంగా ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయాల్లోకి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్, శానిటైజర్‌ తప్పకుండా వాడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: