ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రాజకీయ నాయకుడికి ఇంటా వంటా ఉండదని సినిమాల్లో సెటైర్లు వేస్తుంటారు కానీ.. చాలా మంది నాయకులు మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ అందరూ అందులో విజయం సాధించలేరు. అలా చేయాలంటే వారికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రజలపై ప్రేమ ఉండాలి. ఇవన్నీ తనకు ఉన్నాయని నిరూపించుకుంటున్నారు జగన్.

 

 

ఎందుకంటే.. ఆయన చెప్పిన దాని కంటే ఎక్కువగానే అందించేందుకు తపన పడుతున్నారు. గతంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తానని జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. అప్పుడే బాబోయ్.. 25 లక్షల ఇళ్ల పట్టాలా అనుకున్నారు చాలా మంది. ఆ లక్ష్యం తక్కువేమీ కాదు. ఎందుకంటే.. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పట్టాలు ఇవ్వలేదు మరి. ఆ లక్ష్యం అందుకోవడమే ఎక్కువ కానీ.. జగన్ ఇప్పుడు తానే తాను చెప్పిన దాని కంటే ఎక్కువగా అందిస్తున్నారు.

 

 

వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రకెక్కబోతున్నారు. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలైనా ఇల్లు కట్టాలంటే జీవితకాలంలో సాధ్యం కాని పరిస్థితి. అలాంటిది 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి.. వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే పెద్ద టార్గెట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ పేదల కోసం పెట్టుకున్నారు. కరోనా లాంటి అంతర్జాతీయ విపత్తు వచ్చి ఖజానాకు రూపాయి ఆదాయం రానిరోజు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు.

 

 

ఇప్పటికే 26.77 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రదర్శించారు. ఇంకా చాలా మంది అర్హులు మిగిలిపోయారని సమాచారం రావడంతో దరఖాస్తుల స్వీకరణకు సీఎం వైయస్‌ జగన్‌ గడువు పెంచారు. మే నెలలో దాదాపు 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో సగం అర్హత ఉన్న దరఖాస్తు అనుకున్నా.. 30 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను నిజం చేస్తున్న నాయకుడిగా సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రకెక్కబోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: