వై.ఎస్. జగన్, చంద్రబాబు.. ఈ రెండు భిన్న ధ్రువాలన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎంతటి బద్ద శత్రువులైనా ఏదైనా కార్యక్రమాల్లో ఎదురుపడితే పలకరించుకుంటారు. మర్యాద కోసమైనా ముఖాలపై నవ్వు పులుముకుంటారు. కానీ ఈ ఇద్దరు మాత్రం అలాంటి దృశ్యాలకు ఆస్కారం ఇవ్వరు. అసలు వీరిద్దరూ ఎదురుపడే అవకాశాలు చాలా తక్కువ. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒకటి రెండు సార్లు ఎదుటిపడి చేయికలిపారంతే.

 

 

అయితే అలాంటి జగన్.. ఈసారి చంద్రబాబును ఆహ్వానిస్తారట. ఏ కార్యక్రమానికి అనుకుంటున్నారా.. పోలవరం ప్రారంభోత్సవానికట. అది కూడా 2021 డిసెంబర్ నాటికి. ఈ విషయాన్ని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి సెటైర్‌గా చెబుతున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరాన్ని సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారని అనిల్ అంటున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి చంద్రబాబును కూడా ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని అనిల్ అంటున్నారు.

 

 

చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబుకు దాని గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని అసమర్థుడు చంద్రబాబు అని మంత్రి విమర్శించారు. అసలు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనకు మార్కులు వేసే సీన్‌ చంద్రబాబుకు లేదన్నారు.

 

 

ఏడాది కాలంలోనే దేశంలోనే 4వ బెస్ట్‌ సీఎంగా వైయస్‌ జగన్‌ నిలిచారని, చంద్రబాబు ఏనాడైనా టాప్‌5లో నిలిచారా..? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అయితే.. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. బీసీలకు ఇన్ని పథకాలు చరిత్రలో ఏ సీఎం ప్రవేశపెట్టలేదంటున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: