స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి చిన్నా పెద్ద అందులో గేమ్స్ ఆడుతూ.. లోకాన్ని మర్చిపోతున్నారు.  ఇక ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా వైరస్ రావడంతో మార్చి నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఇంటిపట్టున ఉంటున్న పిల్లలు, పెద్దలు వీడియో గేమ్స్ తో టైమ్ పాస్ చేస్తున్నారు.  ఎంతగా అంటే ఆ పిచ్చిలో తమను తామే మర్చిపోయి ఏం చేస్తున్నామో తెలియనంతగా.. చివరికి కొంతమంది మెంటల్ గా ఎడెక్ట్ కూడా అవుతున్నారు. తాజాగా బైల్‌ గేమ్‌ పబ్జీ ఆడుతూ 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రం కోటాలో  చోటుచేసుకుంది.

 

రైల్వే కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జీ హన్స్‌రాజ్‌ మీనా వివరాలను వెల్లడిస్తూ... ఆర్మీ మ్యాన్‌కు చెందిన కొడుకు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల వాళ్ల అమ్మ వద్ద సెల్ ఫోన్ తీసుకొని ఓ వీడియోగేమ్ డౌన్ లోడ్ చేసుకున్నాడు.  తన సోదరుడు చదువుకుంటున్న గదిలో గేమ్‌ ఆడుతూ ఉన్నాడు. నిద్రకని చెప్పి బెడ్‌రూంలోకి వెళ్లి కిటికి చువ్వలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  అది చూసి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

 

కానీ అప్పటికే ఆ బాలుడు కన్నుమూసినట్టు డాక్టర్లు తెలిపారు.  అయితే కొన్ని వీడియో గేమ్స్ పిల్ల మనస్థత్వాల పై ప్రభావం చూపిస్తుందని.. ముఖ్యంగా పబ్ జీ గేమ్ అయితే ప్రాణాలు తీసుకునేంత డేంజర్ అంటున్నారు.  పబ్ జీ గేమ్ కి ఎడెక్ట్ అయిన వారు పిచ్చెక్కిపోతున్నారు. ఆ గదిలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. బాలుడి తండ్రి ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: