దేశంలో, తెలుగురాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ ను ప్రకటించిన కేంద్రం లాక్ డౌన్ లాక్ డౌన్ కు భారీగా ఆంక్షలను సడలిస్తోంది. ఐడో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
కేంద్రం సడలింపులు ఇవ్వడంతో జగన్ సర్కార్ ఈ నెల 8 నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఈ మేరకు లేఖలు రాశారు. అయితే రేపటి నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు ఏపీ సీఎస్ లేఖలు రాసినా ఆ లేఖల పట్ల ఆయా రాష్ట్రాలు ఎలా స్పందించాయో తెలీదు. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బస్సుల రాకపోకలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రేపటినుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు మొదలవుతాయని వార్తలు వచ్చినా ఇప్పటివరకు అటువంటి సమాచారం తమకు లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రేపటినుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయో లేదో తెలియడం లేదు. 
 
లాక్ డౌన్ వల్ల చాలామంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు ఎక్కువగా ఉన్నారు. వీరు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మంత్రి పేర్ని నాని అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల గురించి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో బస్సుల గురించి సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అంతర్రాష్ట బస్సు సర్వీసులు ఎప్పటినుంచి నడుపుతారో చూడాల్సి ఉంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: