ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో విరుచుకపడుతుందో, మరోవైపు " ఐ కాంట్ బ్రీత్ " ఉద్యమం అదేస్థాయిలో తీవ్రంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం అమెరికా పోలీసులు దౌర్జన్యం తో ఫ్లాయిడ్‌ పై తన తలపై మోకాలిని ఉంచుతా చేసి అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చివరికి అతను మృతి చెందిన సంగతి కూడా విధితమే. ఇంతకుముందు కూడా ఇలాగే అమెరికాలో నల్లజాతి పై వివక్ష చూపిస్తున్నారు అని అనేకమంది రోడ్లపైకి వచ్చి వారి నిరసన ని తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే పరిస్థితి మళ్ళీ మరొక దేశంలో మిన్నంటాయి. అయితే ఈసారి కేవలం నల్లజాతీయుల కాకుండా వారికి తెల్లజాతీయులు కూడా మద్దతు ఇవ్వడం నిజంగా అక్కడి దేశంలో చెప్పుకోదగ్గ విషయమే. 

 


ఇకపోతే తాజాగా మహిళా టెన్నిస్ లెజెండ్ సెరీనా విలియమ్స్ భర్త తన స్థాపించిన నెట్ వర్కింగ్ వెబ్సైట్ సహవ్యవస్థాపకుడు ఓహో నియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే తాను స్థాపించిన రెడిట్‌ సంస్థ బోర్డు పదవి నుంచి తాను స్వచ్ఛందంగా వైదొలుగుతూ ఆస్థానంలో నల్లజాతీయుడిని నియమించేలా పాటుపడతానని తెలియజేశారు. అమెరికన్ల నిరసనలకు మద్దతుగా తెలిపేందుకు తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓహో నియాన్ తెలిపాడు. 

 


ఆయన తన మాటల మధ్యలో నా కుమార్తె పెద్దయ్యాక నువ్వు ఏం చేసావ్ ...? నాన్న అని నన్ను అడిగితే నా వద్ద చెప్పడానికి ప్రస్తుతం సరైన సమాధానం లేదు. కాబట్టి నేను సమాధానం చెప్పాలంటే... ఈ విషయం గర్వంగా చెప్పుకునే అవకాశం ఉందని అందుకే గర్వాంగా నా పదవికి రాజీనామా చేశానని తెలియజేశాడు. నిజంగా ఒక వ్యక్తి సమాజం కోసం తన పదవిని కూడా అలవోకగా త్యాగం చేశాడంటే హర్షించ దగ్గ విషయమే. ఇక అదే మన దేశంలో ఎవరేమైనా పర్వాలేదు అని ఎలాంటి త్యాగాలకు పూనుకోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: