నిజంగా ఇది మానవత్వం మంట కలిసిన సంఘటన. నిజంగా షాకింగ్ లాంటి విషయమే. కొన్ని కొన్ని సార్లు అసలు ఎందుకు అలా చేస్తారని కూడా తెలివి లేకుండా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్ జిల్లాలోని ఆసుపత్రి సిబ్బంది ఒక వృద్ధుని కాళ్లు, చేతులు బిడ్డకు కట్టేశారు. దానికి కారణం ఆ వృద్ధుడు డు హాస్పిటల్ కు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదని. ఇక ఈ అమానుష సంఘటనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆ ఆసుపత్రి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.. 

 


ఇక అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఆ వృద్ధుడు అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చూపించుకొని చికిత్సకు 11 వేల రూపాయలు అయిందని అక్కడి హాస్పిటల్ అధికారులు తెలియజేశారు. అయితే అంత మొత్తం తాను చెల్లించలేనని ఆ మొత్తం చెల్లించకపోవడం కారణంగా సిబ్బంది అలా చేశారని అసలు విషయం తెలిసింది. 

 


ఇకపోతే ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు తాము అతని అడ్మిషన్స్ సమయంలో ఆస్పత్రికి ఐదు వేల రూపాయలు చెల్లించమని కానీ చికిత్సకు ఇన్ని రోజులు కావడంతో డబ్బులు లేక మొత్తాన్ని చెల్లించలేక పోయామని వారు వాపోయారు. మరోవైపు హాస్పిటల్ యాజమాన్యం మరోలా ఈ విషయాన్ని తెలుపుతోంది. హాస్పిటల్ యాజమాన్యం తెలిపిన వివరాల మేరకు సదరు వృద్ధుడికి బ్రెయిన్ డిజాస్టర్ కారణంగా తనను తానే గాయ పరచుకున్న ఎంత స్థితికి చేరడం అందుకే ఇలా చేశామని వారు తెలియజేశారు. అంతేకాకుండా మానవతా దృక్పథంతో అతని బిల్లును పూర్తిగా మాఫీ చేశామని కూడా వారు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నా ఆ పెద్దాయన్ని ఎంతకాలం పడకకు కట్టేస్తారో పాపం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: