దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజుకి పది వేల మార్క్‌కి దగ్గరగా కాస్త అటు ఇటు లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తంగా చూస్తే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల 50 వేల కు దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ గంటల్లోనే ఈ మార్క్‌కి దేశం చేరుకునే పరిస్థితి ప్రస్తుతం కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 7000 దాటగా మరోపక్క డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. అత్యంత జనాభా కలిగిన దేశం లో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు బట్టి చూస్తే పరిస్థితి పెద్ద ప్రమాదం కాదని కొంతమంది అంటున్నారు.

IHG

ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరిగితే  మరోపక్క దేశంలో వైద్య సదుపాయాలు లేని పరిస్థితి నెలకొందని దాన్ని బట్టి చూస్తే దేశంలో డేంజర్ పరిస్థితి రాబోయే రోజుల్లో దాపురించిందని వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్న కొద్ది వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందనే వాదన ఓ పక్క, ప్రజలు సరిగ్గా లాక్‌డౌన్‌ నిబంధనల్ని పాటించలేదన్న వాదనలు మరోపక్క ఇప్పటికీ విన్పిస్తున్నాయి.

IHG

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న ఇచ్చిన సడలింపులు చూస్తే లాక్‌డౌన్‌ వున్నా లేనట్లే.. అనే స్థాయిలో ఉంది అని చాలామంది అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం ప్రమాదకరమైన స్థాయిలో ఉందని త్వరలోనే కరోనా కేసుల పరంగా టాప్‌ 3లోకి చేరడానికి భారత్‌కి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: