ప్రస్తుతం ప్రపంచంలోనే నియంత గా పేరు తెచ్చుకున్న నాయకుడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ఉన్‌. ప్రపంచమంతా ఒకటే అంటే కిమ్‌ జాంగ్‌ఉన్‌ మాత్రం మరో టైపు అంటూ ఎవరి మాటా లెక్కచేయకుండా కొన్ని ప్రమాదకరమైన ప్రయోగాలు చేసి ప్రపంచానికి టెన్షన్ మొన్నటి వరకు పుట్టించాడు. అయితే ఇటీవల కరోనా వైరస్ వచ్చిన సమయంలో ప్రపంచమంత లాక్ డౌన్ లో ఉన్న టైంలో ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అంతర్జాతీయ మీడియా కిమ్‌ జాంగ్‌ఉన్‌ మరణించినట్లు బ్రెయిన్ ఆపరేషన్ డెడ్ అయి ఈ ఘటన జరిగినట్లు వైరల్ వార్తలు ప్రసారం చేసింది.

 

అయితే వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఉత్తరకొరియా అధికార వర్గాలు తెలియజేశాయి. కిమ్‌ మరణ వార్త సస్పెన్స్ కొనసాగుతుండగానే మరోపక్క దేశంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ కార్యక్రమానికి హాజరయి తనపై వస్తున్న పుకార్ల వార్తలకు తెరదించాడు. మూడు వారాలు అజ్ఞాతంలో ఉన్న తర్వాత బయటకు వచ్చినా కిమ్‌ ప్రస్తుతం దేశంలో అధికార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఎంత నియంత అయినా గానీ ఉత్తర కొరియా ఇప్పటివరకు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇతగాడు మాత్రం బిలియన్ డాలర్లను సంపాదిస్తూ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచినట్టు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

 

ఇప్పటిదాకా తన ఆస్తులను కిమ్‌ ఎప్పుడు బయటకు చెప్పలేదు. కనుక ఫోర్బ్స్‌లో కాని మరో దాంట్లో కాని ఇప్పటి వరకు ఆయన ఆస్తుల జాబితా వివరాలు వచ్చిన దాఖలాలు లేవు. కాగా ఆ మీడియా సంస్థ వెళ్లడి చేసిన వివరాల ప్రకారం కిమ్‌కు దాదాపుగా ఐదు బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయట. అయితే ఈ వార్తలు విని చాలా మంది ఇదంతా ఫేక్ వార్తలని కిమ్‌ ఒకరితో పోటీపడే మనస్తత్వం కాదని అంత సీన్ అతనికి లేదని అంటున్నారు. మరోపక్క సదరు అంతర్జాతీయ మీడియా సంస్థ మాత్రం ఉత్తర కొరియా లోని సహజ వనరులు అమ్మడం వల్ల కిమ్‌ ఇన్ని ఆస్తులను కూడా పెట్టుకున్నట్లు కథనాలు మీద కథనాలు ప్రసారం చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: