ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎలా విజృభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరోవైపు దేశంలో రోజురోజుకి చాపకింద నీరులా వైరస్ పాకుతోంది. ఈ తరుణంలో మద్యం బాబులకు కేజ్రీవాల్ సర్కార్ ఓ శుభవార్త తెలియజేసింది. ఈ తరుణంలోనే లాక్ డౌన్ విధానాన్ని ఎత్తి వేస్తున్న సమయంలో మద్యం పై విధించిన కరోనా స్పెషల్ ఫీజును ఉపసంహరించుకున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధానం ఈ నెల 10 తర్వాత నుంచి అమల్లోకి రాబోతోంది. 

IHG's new rules for liquor shops and customers. 10 things ...


ఇక గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం మద్యంపై 70 శాతం వరకు కరోనా స్పెషల్ ఫీజు విధించడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. అయినా కూడా ప్రారంభంలో మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగిన కూడా ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇక ఇలా తగ్గుముఖం పట్టడం దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం కరోనా స్పెషల్ ఫీజు తొలగించడం జరిగింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మద్యంపై వ్యాట్ మాత్రం 20 నుంచి 25 శాతానికి ఢిల్లీ ప్రభుత్వం పెంచడం జరిగింది. 

IHG


ఇక తాజాగా ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 1320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా 53 మంది మరణించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 27654 పాజిటివ్ కేసుల సంఖ్య చేరగా... 761 మంది మృతి చెందడం జరిగింది. ఇక దేశంలో కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారిలో ఢిల్లీ మూడో స్థానంలో కొనసాగుతుంది అంటే నమ్మండి. ఇన్ని కేసులు ఉన్నా కానీ ఢిల్లీ ప్రభుత్వం ఇలాంటి ఆఫర్ ను ఎందుకు ప్రకటించిందో అర్థం అవ్వట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: