నిమ్మగడ్డ రమేష్ కుమార్. మాజీ ఎన్నికల అధికారి. గత  మూడు నెలలుగా ఏపీ రాజకీయాల్లో బాగా నలుగుతున్న పేరు ఇది. నిజానికి ఎన్నికల అధికారులు తెరచాటున ఉంటారు. వారి పేర్లు ఎన్నికలు జరిగినపుడే జనాలకు తెలుస్తుంది.

 

వారు కూడా అపుడే మీడియా ముందుకువస్తారు. ఇంటర్యూలో నిరుద్యోగ అభ్యర్ధులకు  మీ రాష్ట్ర ఎన్నికల అధికారు ఎవరు అని అడిగితే వారు ఠక్కున జవాబు చెప్పలేక  బుర్రగోక్కుంటారు. ఎందకంటే అంత తొందరగా గుర్తుకువచ్చే పేరు కాదు ఇది.  నిజం చెప్పాలంటే మొన్న వివాదం జరిగింది కాబట్టి కానీ గత నాలుగేళ్ళుగా నిమ్మగడ్డరాష్ట్ర  ఎన్నికలాధికారిగా ఉన్నారన్న సంగతి ఏపీలో ఎంతమందికి తెలుసు.

 

సరే ఇపుడు నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సర్కార్ కేసు సుప్రీ కోర్టుకు చేరుకుంది. ఎన్నికల సంస్కరణలో భాగంగా నిమ్మగడ్డను తప్పిస్తూ ఆయన పదవిని మూడేళ్ళకు కుదిస్తూ పంచాయాతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇపుడు బంతి సుప్రీం కోర్టులో ఉంది.

 

సుప్రీం కోర్టులో ఈ కేసు ఈ నెల 10న విచారణకు వస్తోంది. దీంతో ఏపీ రాజకీయాలనే ప్రభావితం చేసిన ఈ కేసులో తీర్పు ఎలా వస్తుంది అన్న టెన్షన్ అందరిలో ఉంది. ఈ కేసులో ప్రభుత్వం ఒక వైపు అన్ని రాజకీయ పార్టీలు మరో వైపు ఉన్నాయి. ఈ కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ బాబ్డే ఆద్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ విచారిస్తోంది.

 

ఈ కేసు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఒకే కానీ. వ్యతిరేకంగా వచ్చి నిమ్మగడ్డ ఏపీ ఎన్నికల అధికారిగా కుర్చీలో కూర్చుంటే మాత్రం వైసీపీకి అది పెద్ద తలనొప్పిగానేగా భావించాలి. అలాగే షాక్ గా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది కూడా. మరి ఇంతటి విశేషం ఉన్న ఈ కేసు విషయంలో తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: