ప్రపంచంలో కరోనా ఏ విధంగా పెరిగిపోతుందో చావులు, కేసలు చెబుతున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం చేస్తున్నది. ఈ మహమ్మారి విజృంభనతో కరోనా మృతుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. గతేడాది చైనాలో పుట్టిన ఈ వైరస్‌ క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపించి మరణ మృదంగం వాయిస్తున్నది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటిరకు 4 లక్షల 135 మంది మరణించారు.  కరోనా మృతుల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్యను వెల్లడించడాన్ని ప్రభుత్వం శనివారం నిలిపివేసింది. అయినా ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 35,930 మంది మరణించారు.

 

యూకేలో 40,548 మంది బాధితులు మరణించారు. మృతుల్లో ఎక్కువగా అమెరికాకు చెందినవారే ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 1,09,802 మంది మృతిచెందారు. అమెరికా తర్వాత బ్రిటన్‌లో అత్యధిక జనాభా కరోనాతో మరణించారు. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్య ధోరణితో కరోనా వ్యాప్తికి కారణమైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు యూఏఈ ప్రకటించింది.ఆ దేశంలో ఆరేళ్ల క్రితం తీసుకొచ్చిన అంటువ్యాధుల నివారణ చట్ట ప్రకారం… కావాలని అంటువ్యాధులను వ్యాప్తి చెందేలా చేసినవారికి రూ.50 వేల నుంచి లక్ష దిర్హమ్స్ జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించనుంది.

 

కాగా, యూఏఈ కరోనా కట్టడిలో భాగంగా ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా 2.5 మిలియన్ల కరోనా పరీక్షలు చేసింది. తాజాగా మరోమారు దేశంలోని ప్రజలందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఇన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా యూఏఈలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అక్కడ 38వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 275 మంది మృత్యువాత పడ్డారు.  ఒకవేళ   నేరం చేసి చిక్కితే శిక్ష రెట్టింపు అవుతుందని స్పష్టంచేసింది.  గత కొన్ని నెలలుగా క్రమం తప్పకుండా శానిటైజేషన్ కార్యక్రమం చేపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: