ఏపీ సీఎం జగన్ అధికారం చేపట్టి ఏడాది గడిచింది. జగన్ పాలనపై జనాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తాను హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల విషయంలో రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నాడన్న పేరు ఓవైపు తెచ్చుకున్నాడు. మరోవైపు అనవసరంగా వివాదాల్లోకి వెళ్లి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. మరోవైపు హైకోర్టులో ప్రతి విషయంలో ఎదురుదెబ్బలు తగలడం చూస్తూనే ఉన్నాం.

 

 

అయితే తొలి ఏడాది కాస్త సంయమనం పాటించిన ఆ రెండు పత్రికలు ఇక జూలు విదులుస్తున్నాయని చెప్పొచ్చు. జగన్ విషయంలో తోక పత్రికగా పేరున్న పత్రిక తన ధోరణి ఏనాడూ మార్చుకోలేదు. ఆరంభం నుంచే ఎక్కడ ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ సర్కారు ధోరణిని ఎండగడుతూనే ఉంది. ఇక రెండో పత్రిక.. అగ్రశ్రేణి పత్రిక మాత్రం మొదటి నుంచి కాస్త బాలన్సు ధోరణితో వ్యవహరించింది.

 

 

అయితే ఇక జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆ పత్రిక కూడా జగన్ సర్కారుపై దూకుడు ప్రారంభించింది. తాజాగా వైసీపీలో అసంతృప్తి సెగలు అంటూ ఓ కథనం ప్రచురించింది. పార్టీలో సీనియర్ల కొందరు పార్టీకి వ్యతిరేకంగా.. మాట్లాడటాన్ని హైలెట్ చేసింది. ప్రత్యేకించి ఏడాది కాలంలో మనం ఏమీ చేయలేకపోయామని వారు అంటున్నారంటూ కథనం రాసింది. అయితే ఈ కథనం కూడా ఆయా నాయకుల మాటల్లోనే సాగిపోయింది కాబట్టి పని కట్టుకుని రాసినట్టు లేదు.

 

 

ఇక తోక పత్రిక పని చెప్పేదేముంది... ప్రతి వారం ఆదివారం ఎడిటోరియల్ కాలం నిండా జగన్ పై ఆరోపణలు, విమర్శలే. ఎప్పుడో ఓసారి కాస్త జగన్ కు అనుకూలంగా రాసినా.. అది వన్స్ ఇన్‌ ఎ బ్లూ మూన్ తరహాలోనే ఉంటుంది. ఏదేమైనా ఇక తెలుగు దేశం అనుకూల పత్రికల నుంచి దాడి మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి జగన్ వీటి దూకుడు ఎలా తట్టుకుంటాడో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: