కర్మ కాలితే ఎవరూ కాపాడలేరని అంటారు.. నిజమే దరిద్రం వెంటాడితే ఎవరైనా దానికి బలి కావాల్సిందే.  ప్రస్తుతం దేశం మొత్తం కరోనా మహమ్మారి మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  అయితే ఈ సమయంలో కొంత మంది దొంగలు రెచ్చిపోతున్నారు.  కాకపోతే దొంగల్లో కొంత మంది మంచి దొంగలు కూడా ఉన్నారు.. ఆ మద్య ఓ వ్యక్తి సైకిల్ చోరీ చేసి ఆ యజమానికి ఓ లేఖ రాశారు.. నేను నా ఊరికి వెళ్తున్న తప్పని సరి పరిస్థితుల్లో ఈ సైకిల్ తీసుకు వెళ్లాల్సి వస్తుంది.. క్షమించండి అంటూ వలస కార్మికుడు సైకిల్ యజమానికి తెలియజేశాడు.  తమిళనాడులో ఓ బైక్ చోరీ చేసి దాన్ని పార్సిల్ చేసి తిరిగి యజమానికి పంపాడు. తాజాగా ఓ దొంగ  600 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి ఊరెళ్లాడు. అసలే కరోనా కాలం నడుస్తోంది. మరో దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు.

 

మోస్ట్‌ వాంటెడ్‌ డెకాయిటీ అయిన ప్రీతమ్‌ ఘోష్‌(30) పశ్చిమ బెంగల్‌, ఒడిశాలో పలు దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఒడిశాలో పట్టుబడి జైలుకు పోయిన ప్రీతమ్‌ ఘోష్‌.. జైలు నుంచి పారిపోయి మాయమయ్యాడు. ఇక శాశ్వతంగా పోలీసుల కంట పడొద్దని భావించాడు. ఇందుకోసం బీహార్‌లోని రాజపకర్‌ ప్రాంతంలోని బసారా గ్రామం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలోని ఉత్తర్‌పారాకు.. దాదాపు 600 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి చేరుకున్నాడు. తన స్వగ్రామమైన ఉత్తర్‌పారా చేరుకున్నాక పాత నేరస్థులతో కలిసి, మరో దొంగతనానికి ప్లాన్ చేశాడు.

 

ఉత్తర్‌పారాలోని యూనియన్‌ బ్యాంక్‌లో గత శుక్రవారం అర్ధరాత్రి దోపిడీకి పాల్పడి దాదాపు రూ.17 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలో మనోడి బాగోతం మొత్తం బయట పడింది. మూడు రోజుల్లోనే ప్రీతమ్‌తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రీతం సైకిల్ మీద 600ల కిలోమీటర్ల ప్రయాణ ఘనకార్యం గురించి పోలీసులకు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: